రాప్తాడు ఉన్మాది ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల కీలక ప్రకటన.. కాలు కోల్పోనున్న హేమంత్?
- కుడి కాలుకు రక్త సరఫరా తగ్గడంతో తొలగించే అవకాశం ఉందన్న వైద్యులు
- వైద్యుల పర్యవేక్షణలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు
- పోలీసులపై రాళ్ల దాడి చేయడంతో కాల్పులు జరిపిన వైనం
రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై దాడికి పాల్పడి, పోలీసుల కాల్పుల్లో గాయపడిన నిందితుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కీలక వివరాలు వెల్లడించారు. అతడి కుడి కాలును తొలగించే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం హేమంత్ అనంతపురం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి మాట్లాడుతూ.. నిందితుడు హేమంత్ కుడి కాలుకు రక్త సరఫరా బాగా తగ్గిపోయిందని తెలిపారు. దీనివల్ల కాలులోని కొంత భాగాన్ని తొలగించాల్సి రావొచ్చని ఆమె పేర్కొన్నారు. రక్త ప్రసరణ ఎందుకు తగ్గిందో ఆపరేషన్ సమయంలోనే స్పష్టత వస్తుందని, ఒకవేళ రక్త సరఫరా పునరుద్ధరణ కాకపోతే కండరాలు పూర్తిగా దెబ్బతింటాయని వివరించారు.
కాగా, బాలికపై దాడి అనంతరం పరారైన హేమంత్ కోసం 15 పోలీసు బృందాలు గాలించాయి. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో అతడిని గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, నిందితుడు పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హేమంత్ రెండు కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.