పులివెందులలో ఉద్రిక్తత: ఆర్వో కార్యాలయం వద్ద జగన్ ధర్నా
Advertisement
- పులివెందుల మున్సిపల్ ఎన్నికలు ఉద్రిక్తం
- ఆర్వో కార్యాలయం ఎదుట ఏజెంట్లతో కలిసి ధర్నా
- టీడీపీ గూండాలు బూత్ కబ్జాలకు పాల్పడ్డారంటూ ఆరోపణ
- పరిస్థితి బీహార్‌ను తలపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు
- వెంటనే రీపోలింగ్ నిర్వహించాలని ఈసీకి డిమాండ్
Advertisement
పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో తీవ్ర అక్రమాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ నిరసనకు దిగారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కార్యాలయం ఎదుట ఆయన తన పార్టీకి చెందిన సుమారు 70 మంది ఏజెంట్లతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ పరిణామంతో పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
పోలింగ్ కేంద్రాల్లోకి తమ ఏజెంట్లను ఎందుకు అనుమతించడం లేదని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన గూండాలు పోలింగ్ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకుని, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అనేక పోలింగ్ బూత్‌లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని, బూత్ కబ్జాలు, రిగ్గింగ్‌తో యథేచ్ఛగా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడ చూసినా టీడీపీ గూండాలే కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఓటర్లను, ఏజెంట్లను, చివరకు మీడియా ప్రతినిధులను కూడా స్వేచ్ఛగా తిరగనివ్వడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. "ఓ మాజీ ముఖ్యమంత్రిని కొట్టాం అనిపించుకోవాలనుకుంటే అలాగే చేయండి.. లాఠీచార్జి చేస్తే చేయండి.. మిగిలింది అదే కదా" అంటూ వ్యాఖ్యానించారు. పులివెందులలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడం లేదని, ఓటమి భయంతోనే అధికార పక్షం ఇలాంటి అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఇక్కడి పరిస్థితి బీహార్‌ను తలపిస్తోందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకుని, ఎన్నికలను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.