టీడీపీపై నెట్టేందుకే దాడులు.. పులివెందుల అరాచకం వెనుక జగన్ డైరెక్షన్: ఎమ్మెల్సీ వర్ల రామయ్య

Andhra
Advertisement
  • ఓటమి భయంతో తమ వాహనాలకు తామే నిప్పుపెట్టుకుని టీడీపీపై నెడుతున్నారని విమ‌ర్శ‌
  • దశాబ్దాల వైఎస్ కుటుంబ ఆధిపత్యానికి ఈ ఎన్నికలతో చరమగీతమ‌న్న వ‌ర్ల‌
  • ఎన్నికల సమయంలో భారీ కాన్వాయ్‌తో రావడం చట్టవిరుద్ధమని విమర్శ
  • ప్రభుత్వ అధికారులు ఎవరికీ భయపడకుండా చట్టప్రకారం పనిచేయాలని సూచన
Advertisement
పులివెందులలో జరుగుతున్న అల్లర్లు, అరాచకాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని, ఆయన దర్శకత్వంలోనే ఈ కుట్రలు జరుగుతున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటమి భయంతో వైసీపీ కార్యకర్తలే తమ వాహనాలకు తామే నిప్పు పెట్టుకుని, ఆ నిందను టీడీపీ, కూటమిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పులివెందులలో దశాబ్దాలుగా కొనసాగుతున్న వైఎస్ కుటుంబ ఆధిపత్యానికి ఈ ఎన్నికలతో చరమగీతం పాడబోతున్నారని అన్నారు.

ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ.. "కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పులివెందులలో కూడా స్వేచ్ఛాయుత, ప్రశాంతమైన ఎన్నికలు జరగాలని సంకల్పించారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్ఠంగా పనిచేస్తున్నాయి. దొంగ ఓట్లు, రిగ్గింగ్, దొడ్డిదారులు ఇక నడవవని స్పష్టం కావడంతో జగన్మోహన్ రెడ్డిలో ఆందోళన మొదలైంది. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తి గడ్డిపోచను పట్టుకున్నట్టు, కనీసం తన పిన్ని ప్రమిళ రెడ్డిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈ అరాచకానికి తెరలేపారు" అని అన్నారు.

పోలింగ్ రోజున 'చేతులు మడతపెడతాను' అని జగన్ చేసిన వ్యాఖ్యలు రౌడీలకు, అసాంఘిక శక్తులకు ధైర్యం ఇచ్చేందుకేనని వర్ల రామయ్య ఆరోపించారు. "బయటి నుంచి ఓటర్లను ట్రాక్టర్లు, కార్లలో తీసుకొచ్చి తోటల్లో దాచిపెట్టారు. కానీ పోలీసులు నిఘా పెంచడంతో వారి దొంగ ఓట్ల ప్రణాళిక విఫలమైంది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, సానుభూతి కోసం తమ వాహనాలకే నిప్పు పెట్టుకుని నాటకాలాడుతున్నారు. గతంలో ఎన్నో అరాచకాలు జరిగినప్పుడు పిలవని జాతీయ మీడియాను ఇప్పుడు ఎందుకు పిలిపించారు?" అని ప్రశ్నించారు.

జగన్‌కు హెలికాప్టర్‌కు అనుమతి రాలేదన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. అనుమతి వచ్చినప్పటికీ, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా భారీ కాన్వాయ్‌తో రావడం చట్ట ఉల్లంఘనేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిబంధనలను పాటిస్తారని గుర్తుచేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, పోలీసులు ఎవరికీ భయపడకుండా, కేవలం చట్టానికి మాత్రమే లోబడి పనిచేయాలని సూచించారు. ఈసారి పులివెందుల ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, ఈ వాతావరణాన్ని చెడగొట్టడానికే జగన్ ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని వర్ల రామయ్య ఆరోపించారు.

Advertisement

సంబంధిత వార్తలు

Varla RamaiahJagan Mohan ReddyPulivendula ViolenceTDP vs YSRCPAndhra Pradesh ElectionsChandrababu Naidu

More Telugu News

దుకాణాలను బీజేపీ బలవంతంగా మూసివేయిస్తోంది.. రాహుల్‌ గాంధీ ఆరోపణలు

01 Nov, 14:26

కేంద్ర ఖజానాకు కాసుల వర్షం.. 23 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు

01 Nov, 14:23

పులివెందులలో ఉద్రిక్తత: ఆర్వో కార్యాలయం వద్ద జగన్ ధర్నా

01 Nov, 14:21

రాష్ట్రమంతా ప్రశాంతం.. కడపలో వైసీపీ హింసకు ముందే ప్లాన్ చేసింది: మంత్రి లోకేశ్

01 Nov, 14:05

ఫేక్ జగన్, ఫేక్ షెడ్యూల్.. వైసీపీ ఫేక్ ప్రచారం: బీటెక్ రవి

01 Nov, 13:49

ఏపీలో ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్.. పట్టణాల్లో జోరు, నగరాల్లో నీరసం

01 Nov, 13:22

టీవీ చూస్తూ భోజనం చేస్తున్నారా?.. జీర్ణ సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనంటున్న నిపుణులు!

01 Nov, 12:51

ఐదో టీ20లో టాస్ కివీస్‌దే.. జట్టులో కీలక మార్పులతో బరిలోకి టీమిండియా

01 Nov, 12:39

పులివెందుల ర్యాలీలో ఉద్రిక్తత.. జగన్‌కు ఎదురుపడి నినాదాలు చేసిన దస్తగిరి!

01 Nov, 12:27

'ఆర్‌సీ17' పూజా కార్యక్రమం.. స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మెగాస్టార్ చిరంజీవి

01 Nov, 12:13

ట్రై సిరీస్ ఫైనల్లో పాక్ థ్రిల్లింగ్ విన్.. భారత్ 24 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డు సమం

01 Nov, 11:56

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్ఈసీ.. అంద‌రూ బాధ్యతగా ఓటేయాల‌న్న‌ పునేఠా

01 Nov, 11:33

పులివెందులలో జగన్ పొలిటికల్ డ్రామా.. ఓటమి భయంతోనే కొత్త నాటకాలు: బీటెక్ రవి

01 Nov, 11:20

హైదరాబాద్‌లో అండాల దందా గుట్టురట్టు.. 43 మంది మహిళలకు విముక్తి

01 Nov, 11:06
..More Telugu News