పులివెందులలో జగన్ పొలిటికల్ డ్రామా.. ఓటమి భయంతోనే కొత్త నాటకాలు: బీటెక్ రవి
Advertisement
- రాజకీయ లబ్ధి కోసమే పులివెందులలో జగన్ అలజడి సృష్టిస్తున్నారని విమర్శ
- వాహనాల దహనం జగన్ డైరెక్షన్‌లో జరిగిన ఒక డ్రామా అన్న రవి
- ఓటమి భయంతోనే సానుభూతి కోసం వైసీపీ కుట్రలు చేస్తోందని వ్యాఖ్య
- గతంలో బాబాయ్ హత్య తరహాలోనే టీడీపీపై నిందలు వేసే యత్నమని ఆరోపణ
- పులివెందులలో ఫ్యాక్షన్ రాజకీయాలకు కాలం చెల్లిందన్న టీడీపీ నేత
Advertisement
పులివెందులలో ఉద్రిక్తతలు సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ అధినేత జగన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ పులివెందుల ఇన్‌చార్జ్ బీటెక్ రవి తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఇటీవల జరిగిన వాహనాల దహనం ఘటన పూర్తిగా జగన్ డైరెక్షన్‌లో నడిచిన డ్రామా అని ఆయన విమర్శించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించి, టీడీపీకి చెడ్డపేరు తీసుకురావాలనే లక్ష్యంతోనే ఇలాంటివి చేస్తున్నారని మండిపడ్డారు.
గతంలో తన బాబాయ్‌ని హత్య చేసి, ఆ నేరాన్ని టీడీపీపైకి నెట్టేందుకు ప్రయత్నించినట్లే, ఇప్పుడు వాహనాలను తగలబెట్టి మరోసారి తమపై నిందలు వేయడానికి కుట్ర చేస్తున్నారని బీటెక్ రవి ఆరోపించారు. ముందు రోజు రాత్రి వాహనాలను తగలబెట్టడం, తెల్లారేసరికి దాడి జరిగిందంటూ ప్రచారం చేయడం వెనుక రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
ఓటమి భయంతోనే జగన్ ఇలాంటి కొత్త నాటకాలకు తెరతీశారని, పులివెందులలో అలజడి సృష్టించి ప్రజల్లో సానుభూతి పొందాలన్నది వైసీపీ ఎత్తుగడ అని విమర్శించారు. అయితే, గతంలోలా ప్రజలు భయపడే పరిస్థితులు ఇప్పుడు లేవని, పులివెందులలో ఫ్యాక్షన్ రాజకీయాలకు కాలం చెల్లిందని బీటెక్ రవి స్పష్టం చేశారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, అభివృద్ధి, శాంతియుత వాతావరణాన్నే ఆశిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.