తుపాను బాధితుల కష్టం తెలుసు.. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు భరోసా

Andhra
Advertisement
  • పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన
  • తుపాను బాధితులను ఆదుకుంటామని, పంటల బీమాతో ధీమా కల్పిస్తామని హామీ
  • 15 వేల విద్యుత్ స్తంభాలు కూలాయని, సరఫరా పునరుద్ధరణకు చర్యలు
  • తుపాను నష్టం ప్రాథమికంగా రూ.4,600 కోట్లుగా అంచనా
  • బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ
  • అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధుల విడదల
Advertisement
‘అర్నబ్’ తుపాను సృష్టించిన బీభత్సం వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. నీట మునిగిన పంటలతో కన్నీరు పెడుతున్న రైతులు, తీవ్ర నష్టాలను ఎదుర్కొన్న కొబ్బరి రైతులు, జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన చేపట్టి, వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి, బాధితుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన పర్యటనలో భాగంగా, రెండో రోజైన శుక్రవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు, నరసాపురం మండలాల్లో విస్తృతంగా పర్యటించారు.

పంటల బీమాతోనే రైతుకు ధీమా
నరసాపురం మండలం కొత్త నవరసపురంలో నీట మునిగిన వరి పంట పొలాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. అక్కడి రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టంపై ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేసి ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి రైతు తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని సూచించారు. 

"ప్రకృతి వైపరీత్యాలు మన చేతుల్లో లేవు. కానీ, నష్టం జరిగినప్పుడు బీమా ఉంటే రైతుకు ఆర్థికంగా భరోసా ఉంటుంది. ఇ-పంట విధానం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం అందించే ఇన్‌పుట్ సబ్సిడీకి అదనంగా బీమా పరిహారం రైతుకు అండగా నిలుస్తుంది" అని వివరించారు. 

పంట కాలువల్లో పూడిక కారణంగా నీటి ప్రవాహం సరిగా లేక పంటలు ముంపునకు గురవుతున్నాయని రైతులు సీఎం దృష్టికి తీసుకురాగా, ఆయన తక్షణమే స్పందించారు. గోదావరి డెల్టా కాలువల ఆధునీకరణకు రూ.3 వేల కోట్లు కేటాయించామని, త్వరలోనే పనులు ప్రారంభించి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. రైతులు ప్రకృతి సేద్యం వైపు దృష్టి సారిస్తే, పంటలకు మంచి డిమాండ్ వస్తుందని, ఆదాయం కూడా పెరుగుతుందని సూచించారు.

నేలకొరిగిన 15 వేల విద్యుత్ స్తంభాలు
తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 15 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు నేలకూలాయని, ఇది విద్యుత్ సరఫరాకు పెను సవాలుగా మారిందని సీఎం తెలిపారు. "రేపు సాయంత్రానికల్లా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తాం. తొలుత గృహ అవసరాలకు, ఆ తర్వాత వ్యవసాయానికి విద్యుత్ అందిస్తాం" అని ప్రకటించారు. అవసరమైతే తెలంగాణ నుంచి కూడా అదనపు సిబ్బందిని రప్పించి పనులు వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. 

పునరుద్ధరణ పనులను స్వయంగా పరిశీలించిన ఆయన, కార్మికులతో కలిసి విద్యుత్ స్తంభాన్ని నిలబెట్టేందుకు సహకరించి వారిలో స్ఫూర్తి నింపారు. విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న విద్యుత్ సిబ్బందిని, కార్మికులను ముఖ్యమంత్రి అభినందించారు. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే 12,500 చెట్లు కూలిపోయాయని, వాటిని తొలగించి రవాణా వ్యవస్థను పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. ప్రైవేట్ టెలికాం టవర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడిందని, వాటిని కూడా త్వరగా పునరుద్ధరిస్తామని తెలిపారు.

షెల్టర్లలో బాధితులకు భరోసా.. మత్స్యకారులకు హామీ
అనంతరం మొగల్తూరు మండలం మాట్రేవు గ్రామంలోని తుపాను పునరావాస కేంద్రాన్ని (షెల్టర్) ముఖ్యమంత్రి సందర్శించారు. గత నాలుగు రోజులుగా అక్కడే ఆశ్రయం పొందుతున్న మహిళలు, వృద్ధులు, చిన్నారులతో మాట్లాడారు. తుపాను తీరం దాటే సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపామని, తీవ్ర భయాందోళనకు గురయ్యామని బాధితులు సీఎంకు వివరించారు. 

దీనిపై స్పందించిన చంద్రబాబు, "ప్రభుత్వం ముందుగానే హెచ్చరికలు జారీ చేసి, ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్లే ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగాం. మీ ప్రాణాలకు మాది భరోసా" అని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వశిష్ట గోదావరి ముఖద్వారం వద్ద పూడిక సమస్య తీవ్రంగా ఉందని, దీనివల్ల వేటకు వెళ్లడం కష్టంగా మారిందని మత్స్యకారులు సీఎం దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన ఆయన, సముద్ర ముఖద్వారం వద్ద పూడికను తొలగించి, మత్స్యకారులు సులభంగా వేట సాగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

రూ.4,600 కోట్ల నష్టం.. కేంద్ర బృందం పర్యటన
షెల్టర్ సందర్శన అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. ‘అర్నబ్’ తుపాను ప్రభావాన్ని ప్రత్యక్షంగా పరిశీలించానని, ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలనిచ్చాయని అన్నారు. 

"రాత్రంతా సమీక్షలు నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేశాం. గతంతో పోలిస్తే ప్రాణ నష్టాన్ని భారీగా తగ్గించగలిగాం. అయినప్పటికీ, దురదృష్టవశాత్తూ ఏడుగురు మరణించడం బాధాకరం" అని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామని తెలిపారు. 

తుపాను వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రానికి రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లిందని, ఈ మేరకు కేంద్రానికి నివేదిక పంపామని చెప్పారు. పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేసి మరో నివేదిక అందిస్తామని, నష్ట తీవ్రతను పరిశీలించేందుకు కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటిస్తోందని వెల్లడించారు.

బాధితులకు నిత్యావసరాలు, రైతులకు నిధులు
తుపాను కష్టకాలంలోనూ రైతులకు అండగా నిలుస్తూ, పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులను శుక్రవారం రైతుల ఖాతాల్లో జమ చేశామని సీఎం ప్రకటించారు. తుపాను బాధిత కుటుంబాలకు బియ్యంతో పాటు కందిపప్పు, వంటనూనె, బంగాళదుంపలు వంటి నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సహాయక శిబిరాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ అందేలా చర్యలు తీసుకున్నామని, తుపాను వల్ల నష్టపోయిన చిట్టచివరి వ్యక్తికి కూడా న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం బాధితులకు ఆయన స్వయంగా రేషన్ సరుకులు పంపిణీ చేశారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట మంత్రి నిమ్మల రామానాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Chandrababu NaiduCyclone ArnabAndhra Pradesh FloodsWest Godavari ReliefCrop InsuranceDisaster Management

More Telugu News

ఏపీకి రేపు కేంద్ర బృందం.. తుపాను నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన

30 Oct, 22:36

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై తొలిసారి రఫేల్ ల్యాండింగ్.. చరిత్ర సృష్టించిన భారత నౌకాదళం

30 Oct, 22:13

లండన్‌లో ఉందని అనుకుంటే.. పుణే ఫ్లాట్‌లో శవమై కనిపించిన మహిళ!

30 Oct, 21:59

ఆ క్రెడిట్ అతనికే దక్కుతుంది: అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ప్రశంసలు

30 Oct, 21:42

బోనీ కపూర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌ గుట్టు రట్టు చేసిన జాన్వీ, అర్జున్ కపూర్!

30 Oct, 21:19

సింగరేణి కార్మికులకు మరో బోనస్.. ఒక్కొక్కరికి రూ.1.10 లక్షలు!

30 Oct, 20:32

అమ్మ చెప్పిన నెంబర్.. రోహిత్ శర్మ 'జెర్సీ నెంబర్ 45' వెనుక కథ ఇదే!

30 Oct, 20:20

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. నగర జీవనం అస్తవ్యస్తం

30 Oct, 20:06

చైనాలో అమ్మాయిల కొరత.. విదేశీ వధువుల పేరిట యువకులకు కుచ్చుటోపీ

30 Oct, 19:54

అతడి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది: ఆక్లాండ్ లో ఓటమి తర్వాత శ్రేయస్ అయ్యర్ కామెంట్స్

30 Oct, 19:44

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం విషాదాంతం.. ఆరుగురి మృతి

30 Oct, 19:23

ఎల్లమ్మ' కోసం డీఎస్పీ భారీ ప్రయోగం.. 100 మంది జానపద వాద్య కళాకారులతో టైటిల్ సాంగ్!

30 Oct, 18:34

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ముగిసిన ప్రచారం.. ఎల్లుండే పోలింగ్

30 Oct, 18:20

బాలీవుడ్ నటి సారా అలీఖాన్‌పై ఫత్వా.. అండగా నిలిచిన హిందూ స్వామీజీ

30 Oct, 18:05
..More Telugu News