అమెరికాలో గాంధీ మనవడి ఆస్తి వివాదం.. న్యాయపోరాటంలో గెలిచి 30 ఎకరాల భూమి స్వాధీనం

International
Advertisement
  • స్థానిక చట్టంతో ఆస్తిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన అమెరికన్
  • భారత్ నుంచే న్యాయపోరాటం చేసి గెలిచిన గాంధీ చారిటబుల్ ట్రస్ట్
  • కబ్జాదారుడిని ఖాళీ చేయమని ఆదేశించిన వర్జీనియా కోర్టు
  • గాంధేయవాద వ్యాప్తికి ఈ ఆస్తిని వినియోగించనున్న‌ ట్రస్ట్
Advertisement
అమెరికాలో మహాత్మా గాంధీ మనవడికి చెందిన 30 ఎకరాల విలువైన ఆస్తిని కబ్జా చేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని అక్కడి కోర్టు అడ్డుకుంది. ఈ ఆస్తి వివాదంలో, గాంధీ మనవడు ఏర్పాటు చేసిన చారిటబుల్ ట్రస్టుకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. స్థానిక చట్టాలను అడ్డం పెట్టుకుని భూమిని సొంతం చేసుకోవాలని చూసిన అమెరికా వాసికి కోర్టులో చుక్కెదురైంది. ఆక్రమణలను వెంటనే తొలగించి, భూమిని ట్రస్టుకు అప్పగించాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

వివాదం నేపథ్యం ఏమిటి?
మహాత్మా గాంధీ మనవడు కాను గాంధీ, ఆయన భార్య శివ గాంధీ 1987లో అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో షెనన్‌డో నేషనల్ పార్క్ సమీపంలో 30 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 2013లో వారు భారతదేశానికి తిరిగి వచ్చారు. వారి మరణానంతరం, ఈ ఆస్తులన్నీ వారు స్థాపించిన 'డాక్టర్ శివ అండ్ కాను రాందాస్ మోహన్‌దాస్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్'కు సంక్రమించాయి. గాంధేయవాద వ్యాప్తికి సంబంధించిన సేవా కార్యక్రమాలకు ఈ ఆస్తులను వినియోగించాలనేది వారి సంకల్పం.

అయితే, 2025 జనవరిలో గ్రెగరీ బ్లాక్ అనే స్థానిక వ్యక్తి ఈ భూమి తనదేనంటూ ట్రస్టుకు లీగల్ నోటీసు పంపడంతో వివాదం మొదలైంది. వర్జీనియాలోని ఓ చట్టం ప్రకారం.. ఒక ప్రదేశాన్ని 15 ఏళ్లపాటు నిరంతరాయంగా, బహిరంగంగా, ఇతరుల ప్రమేయం లేకుండా వాడుకుంటే దానిపై యాజమాన్య హక్కులు వస్తాయని అతడు వాదించాడు. దీనికి ఆధారంగా తాను ఆ భూమిలో ఓ చిన్న ఇల్లు (క్యాబిన్), వేట కోసం స్టాండ్‌లు, కాలిబాటలు నిర్మించానని పేర్కొన్నాడు.

భారత్ నుంచే న్యాయపోరాటం
ఈ కబ్జా ప్రయత్నాన్ని గాంధీ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అయిన పరిమళ్ దేశాయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన భారత్‌లోనే ఉంటూ ఈ న్యాయపోరాటాన్ని ముందుండి నడిపించారు. అమెరికాలో న్యాయవాదులను నియమించుకున్నారు. 2024లో దాదాపు 4,500 డాల‌ర్లు (రూ.4.27ల‌క్ష‌లు) ఖర్చు చేసి భూమిని సర్వే చేయించారు. కాను గాంధీ వీలునామాను 2025లో కోర్టు ద్వారా అధికారికంగా ధ్రువీకరింపజేసి, ఆస్తిపై ట్రస్టుకు హక్కులను ఖాయం చేశారు.

పరిమళ్ దేశాయ్ ఈ కేసులో ఆధునిక టెక్నాలజీని కూడా సమర్థంగా వాడుకున్నారు. న్యాయపరమైన వ్యూహాలు రచించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ ఉపయోగించారు. బ్లాక్ చెబుతున్న క్యాబిన్ 15 ఏళ్లుగా అక్కడ లేదని నిరూపించేందుకు జీఐఎస్ మ్యాపులను కోర్టుకు సమర్పించారు. అంతేకాకుండా తాను 2020 నుంచి ఆ భూమిని సందర్శిస్తున్న ఆధారాలను, అక్కడ మరో వ్యక్తి కూడా నివసిస్తున్న విషయాన్ని బయటపెట్టి, బ్లాక్ వాదిస్తున్న 'ఏకస్వామ్య హక్కు' వాదనను తిప్పికొట్టారు.

కోర్టు తీర్పు
ఇరుపక్షాల వాదనలు విన్న వారెన్ కౌంటీ సర్క్యూట్ కోర్టు న్యాయమూర్తి డారిల్ ఎల్. ఫంక్, అక్టోబర్ 21న తుది తీర్పు వెలువరించారు. గ్రెగరీ బ్లాక్ వాదనలను పూర్తిగా తోసిపుచ్చారు. 30 రోజుల్లోగా ఆ భూమిలోని హట్స్, వేట స్టాండ్‌లతో పాటు తన వ్యక్తిగత వస్తువులన్నింటినీ సొంత ఖర్చులతో తొలగించుకోవాలని ఆదేశించారు. 

భవిష్యత్తులో ఆ భూమిపై ఎలాంటి హక్కులు క్లెయిమ్ చేయరాదని స్పష్టం చేశారు. దీంతో పాటు కోర్టు ఖర్చుల కింద 11,375 డాల‌ర్లు (రూ.10.80ల‌క్ష‌లు) చెల్లించాలని కూడా ఆదేశించారు. ఈ తీర్పుతో గాంధీ వారసత్వ సంపదను కాపాడాలన్న ట్రస్ట్ సంకల్పం నెరవేరింది.
Advertisement

సంబంధిత వార్తలు

Kanu GandhiGandhi grandson propertyVirginia land disputeGandhi Charitable TrustUS court land verdictParimal Desai

More Telugu News

ఈ ఏడాది 40 వికెట్లు.. మొత్తం 150 వికెట్లతో టీ20ల్లో అర్ష్‌దీప్‌ సరికొత్త రికార్డు

30 Oct, 15:32

గుండె ఆరోగ్యానికి పిక్క కండరాలకూ సంబంధం.. వాటిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!

30 Oct, 15:25

అండర్-19 ఆసియా కప్‌కు భార‌త జ‌ట్టు ప్రకటన.. ఒకే గ్రూప్‌లో భారత్, పాక్‌.. టీమ్‌లోకి సెహ్వాగ్, ద్రవిడ్ కుమారులు

30 Oct, 15:24

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్

30 Oct, 15:22

అనిరుధ్-కావ్యల పెళ్లి పత్రిక.. డిజైనర్ చెప్పిన ఆసక్తికర విశేషాలివే!

30 Oct, 15:08

ఏపీలో పింఛన్ల పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతి.. కానీ షరతులు వర్తిస్తాయి

30 Oct, 15:06

'ఛావా' డైరెక్టర్ నుంచి మరో బయోపిక్.. ఆకట్టుకుంటున్న 'ఈఠా' ట్రైలర్

30 Oct, 14:58

చిన్న బౌండరీల్లో చితకబాదిన న్యూజిలాండ్‌.. భారత్‌ ముందు భారీ టార్గెట్‌

30 Oct, 14:56

అర్నబ్ తుపాను: చివరి బాధితుడికి సాయం అందేవరకు విశ్రమించేది లేదు: సీఎం చంద్రబాబు

30 Oct, 14:47

అండమాన్ సముద్రంలో అల్పపీడనం.. ఏపీ తీరం వైపు పయనం!

30 Oct, 14:37

బ్యాంకులను కాంగ్రెస్‌ సొంత సంస్థల్లా వాడుకుంది.. ఐడీబీఐ వాటాల విక్రయంపై రాహుల్‌కు నిర్మలా కౌంటర్‌

30 Oct, 14:36

మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం వస్తోందా? ఎప్పుడు అప్రమత్తం కావాలంటే..!

30 Oct, 14:01

రూ.16 లక్షల లోన్ ఆశ చూపి మోసం.. రూ.1.90 లక్షలు కట్టించుకుని ఎస్కేప్.. చివ‌రికి!

30 Oct, 13:46

హైదరాబాద్‌కు జనవరి నుంచి 8 నెలల పాటు భారీ నీటి కష్టాలు: జలమండలి ఎండీ వార్నింగ్

30 Oct, 13:45
..More Telugu News