ఆర్మేనియా పార్లమెంట్‌లో ఎంపీల ముష్టియుద్ధం.. ప్రజలు చూడాలని లైవ్ ఆపని స్పీకర్!

International
Advertisement
  • ఆర్మేనియా పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య తీవ్ర ఘర్షణ
  • ప్రత్యక్ష ప్రసారంలోనే పిడిగుద్దులు, తన్నులు, కుర్చీలతో దాడులు
  • అవినీతి ఆరోపణలతో మొదలైన వాగ్వాదం హింసకు దారితీసిన వైనం
  • ఎంపీల ప్రవర్తనను ప్రజలు చూడాలనే ప్రత్యక్ష ప్రసారం ఆపని స్పీకర్
  • తమ పార్టీ ఎంపీల చర్యలను సమర్థించిన ఆర్మేనియా ప్రధాని
Advertisement
ఆర్మేనియా పార్లమెంటులో అసాధారణ దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ప్రత్యక్ష ప్రసారం జరుగుతుండగానే ఎంపీలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు, తన్నుకున్నారు. ఈ గొడవలో ఒక ఎంపీ కుర్చీ విసిరి దాడి చేయగా, మరొకరు నీళ్లు చల్లుకుని సభలో గందరగోళం సృష్టించారు.

గురువారం ఆర్మేనియా నేషనల్ అసెంబ్లీలో ఆడిట్ ఛాంబర్ సభ్యుడి ఎన్నికపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రధాని నికోల్ పషిన్యాన్ నేతృత్వంలోని అధికార సివిల్ కాంట్రాక్ట్ పార్టీ ఎంపీ టరాన్ చఖోయాన్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష స్ట్రాంగ్ ఆర్మేనియా పార్టీపై అవినీతి ఆరోపణలు చేశారు. ఆ పార్టీ నేత నరేక్ కారపెత్యాన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, ఆయన బంధువు చేసిన పాత వ్యాఖ్యలను గుర్తుచేశారు. దీంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం మొదలైంది.

ఈ క్రమంలోనే నరేక్ కారపెత్యాన్ పోడియం వద్దకు దూసుకురావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రతిపక్ష ఎంపీ గార్నిక్ దావ్త్యాన్ తొలి పిడిగుద్దు విసిరారని స్పీకర్ తెలిపారు. అనంతరం సభ మొత్తం రణరంగంగా మారింది. డిప్యూటీ స్పీకర్ వాహగ్న్ అలెక్సాన్యన్ ఏకంగా ప్రతిపక్ష సభ్యులపైకి కుర్చీ విసిరారు. ఈ ఘర్షణలో ప్రతిపక్ష ఎంపీ ఆండ్రానిక్ గెవోర్గ్యాన్ ముక్కు పగిలి రక్తం కారగా, మరో ఎంపీ రూబెన్ ఖితార్యాన్ దుస్తులు చిరిగాయి. దీంతో పార్లమెంటు భవనం వద్దకు అంబులెన్స్‌ను పిలిపించారు.

కొద్దిసేపు ఘర్షణను చూస్తూ ఉండిపోయిన స్పీకర్ రూబెన్ రూబిన్యాన్, ఎంపీల ప్రవర్తనను ప్రజలు చూడాలనే ఉద్దేశంతోనే తాను ప్రత్యక్ష ప్రసారాన్ని కొనసాగించానని స్పష్టం చేశారు. అనంతరం సభను వాయిదా వేశారు. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని నికోల్ పషిన్యాన్, హింసకు పూర్తి బాధ్యత ప్రతిపక్షాలదేనని ఆరోపించారు. తమ పార్టీ ఎంపీల చర్యలను సమర్థిస్తూ, కుర్చీ విసరడం "సరైన ప్రతిచర్య" అని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రతిపక్షాలు తమ స్థానం తెలుసుకోవాలని, లేదంటే ఇలాంటి పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు అంతర్జాతీయంగా వైరల్ అయ్యాయి.
Advertisement

సంబంధిత వార్తలు

Armenia ParliamentMP brawlNikol PashinyanRuben RubinyanPolitical violenceArmenia news

More Telugu News

చంద్రబాబు విజ్ఞప్తికి వెంటనే స్పందించిన తెలంగాణ ప్రభుత్వం

29 Oct, 22:38

నాలుగు కుర్చీల హోటల్.. ఇప్పుడు 100కు పైగా బ్రాంచీలు.. 'దిండిగల్‌ తలపాకట్టి బిర్యానీ' విజయగాథ!

29 Oct, 22:27

ఏపీ ఇంటర్ విద్యార్థులకు ఊరట.. ఫీజు చెల్లింపు గడువును పొడిగించిన బోర్డు

29 Oct, 22:16

పక్షవాతానికి, విటమిన్ బీ6కి సంబంధం.. యువతకు అలర్ట్!

29 Oct, 22:01

ఆస్తుల సంఖ్య కాదు, ఆదాయమే ముఖ్యం.. మారిన రియల్ ఎస్టేట్ సూత్రం!

29 Oct, 21:46

జాన్వీ గోల్డ్ కలర్ డ్రెస్సు అంత ఖరీదైనదా..?

29 Oct, 21:35

జేఈఈ మెయిన్ 2027: దరఖాస్తుదారులకు ఎన్టీఏ అలర్ట్

29 Oct, 21:19

ఆర్థిక వివాదంలో రామ్ గోపాల్ వర్మ.. రూ. 29 కోట్లకు పైగా చెల్లించాలన్న ఎక్లాటెంట్ ఫిల్మ్స్!

29 Oct, 21:13

ఇక కబ్జా కుదరదు.. ఆర్.కె.పురం చెరువుకు 'హైడ్రా' కంచె

29 Oct, 20:37

నటిని కాకుంటే క్రికెటర్ అయ్యేదాన్ని: జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు

29 Oct, 20:29

అంతరిక్షంలో చైనా రహస్య విమానం.. డ్రాగన్ ప్లాన్ ఏంటి..?

29 Oct, 20:17

తుపానుతో కోనసీమ జిల్లాలో వేలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి: మంత్రి గొట్టిపాటి

29 Oct, 20:01

అమెరికా ఒప్పందంతో భారత్‌కు లాభదాయకమే.. ఒక్క ప్రయోజనం కూడా దెబ్బతినదు: పీయూష్ గోయల్

29 Oct, 19:51

రాజేశ్ ఖన్నా భార్యగా గుర్తించలేం.. సుప్రీంకోర్టులో అనితా అద్వానీ పిటిషన్ కొట్టివేత

29 Oct, 19:42
..More Telugu News