రామ్‌లీలా మైదానానికి తరలిరండి.. విద్యార్థులకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి

National
Advertisement
  • ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఈ ఉద్యమం అని వెల్లడి
  • ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని స్పష్టం
  • భయపడకుండా విద్యార్థులు తరలిరావాలని ప్రత్యేక విజ్ఞప్తి
  • పోలీసులకు, లాఠీలకు భయపడొద్దని యువతకు ధైర్యం చెప్పిన రాహుల్
Advertisement
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ దేశ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. నవంబర్ 1న న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ రామ్‌లీలా మార్చ్’కు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశ ఆత్మను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఈ ఉద్యమమని, ఓట్ల దొంగతనాన్ని అడ్డుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం ఏ ఒక్క రాజకీయ పార్టీకి మాత్రమే పరిమితం కాదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ఎన్నికల కమిషన్ వైఖరితో విభేదించే ప్రతి ఒక్కరూ, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే పౌరులందరూ ఈ మార్చ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.

"మీ భావ ప్రకటనా స్వేచ్ఛ, ఆలోచనలు, జీవన విధానంపై దాడి జరుగుతోందని మీరు భావిస్తే, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఈ మార్చ్‌కు తరలిరండి. పోలీసులకు, లాఠీలకు భయపడవద్దు. బీజేపీ ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడే సాహసం చేయదు" అని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని, దీనిని విజయవంతం చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

Rahul GandhiRamlila Maidan MarchChalo DelhiStudent Protest DelhiSave Democracy MovementNew Delhi Events

More Telugu News

ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్సీ మార్పు?.. హార్దిక్ భవిష్యత్తుపై నీలినీడలు

30 Oct, 07:59

బీజేపీకి షాక్.. దర్భంగా గ్రాడ్యుయేట్స్ స్థానాన్ని కైవసం చేసుకున్న ఆర్జేడీ

30 Oct, 07:59

టీ20 చరిత్రలో సరికొత్త రికార్డ్.. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్

30 Oct, 07:35

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. రైల్వే స్టేషన్‌లో మారణహోమం

30 Oct, 07:06

విలేకరిపై డొనాల్డ్ ట్రంప్ బాడీ షేమింగ్.. చూడటానికి భయంకరంగా ఉన్నావంటూ వ్యాఖ్యలు

30 Oct, 06:41

‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలపై దుమారం.. నసీరుద్దీన్ షాపై ఎన్డీఏ నేతల ఫైర్

30 Oct, 06:14

కొడుకుతో బంధంపై అమితాబ్ ఫన్నీ కామెంట్స్.. కేబీసీలో నవ్వులు

30 Oct, 06:10

ఆర్మేనియా పార్లమెంట్‌లో ఎంపీల ముష్టియుద్ధం.. ప్రజలు చూడాలని లైవ్ ఆపని స్పీకర్!

29 Oct, 22:48

చంద్రబాబు విజ్ఞప్తికి వెంటనే స్పందించిన తెలంగాణ ప్రభుత్వం

29 Oct, 22:38

నాలుగు కుర్చీల హోటల్.. ఇప్పుడు 100కు పైగా బ్రాంచీలు.. 'దిండిగల్‌ తలపాకట్టి బిర్యానీ' విజయగాథ!

29 Oct, 22:27

ఏపీ ఇంటర్ విద్యార్థులకు ఊరట.. ఫీజు చెల్లింపు గడువును పొడిగించిన బోర్డు

29 Oct, 22:16

పక్షవాతానికి, విటమిన్ బీ6కి సంబంధం.. యువతకు అలర్ట్!

29 Oct, 22:01

ఆస్తుల సంఖ్య కాదు, ఆదాయమే ముఖ్యం.. మారిన రియల్ ఎస్టేట్ సూత్రం!

29 Oct, 21:46

జాన్వీ గోల్డ్ కలర్ డ్రెస్సు అంత ఖరీదైనదా..?

29 Oct, 21:35

జేఈఈ మెయిన్ 2027: దరఖాస్తుదారులకు ఎన్టీఏ అలర్ట్

29 Oct, 21:19
..More Telugu News