ఏపీకి డబుల్ కష్టాలు.. సాధారణ స్థితి వచ్చేవరకు విశ్రమించొద్దు: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Advertisement
- అర్నబ్ తుపాను అనంతర పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- రేపటిలోగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశం
- పంట నష్టం మినహా ఇతర పరిహారాన్ని వేగవంతం చేయాలని సూచన
- నీట మునిగిన పంటలను కాపాడే మార్గాలపై అధ్యయనం చేయాలని పిలుపు
- పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థితి వచ్చేవరకు క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశాలు
Advertisement
అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ చర్యలను సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు అధికార యంత్రాంగం విశ్రమించవద్దని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తుపాను నష్టంపై ప్రాథమిక నివేదికను ఇవాళ అందిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. "తుపాను సమయంలో అధికార యంత్రాంగం అద్భుతంగా పనిచేసింది. ప్రాణ, ఆస్తి నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించగలిగాం. ఇప్పుడు పునరుద్ధరణ పనులపై దృష్టి సారించాలి. రేపటిలోగా తుపాను ప్రభావిత ప్రాంతాలన్నింటిలో విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలి. ఎక్కడైనా రోడ్లపై చెట్లు, చెత్తాచెదారం ఉంటే తక్షణమే తొలగించాలి" అని ఆదేశించారు. నష్టపరిహారం చెల్లింపునకు సంబంధించి ఇప్పటికే జీవో జారీ చేశామని, పంట నష్టం మినహా మిగిలిన బాధితులందరికీ పరిహారం అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
రాష్ట్రం ప్రస్తుతం రెండు రకాల విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోందని ముఖ్యమంత్రి విశ్లేషించారు. "ఒకవైపు రాయలసీమలో ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటలు వేసుకోలేని దుస్థితి ఉంది. మరోవైపు, కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అర్నబ్ తుపాను కారణంగా వేసిన పంటలు, ఉద్యాన తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ రెండింటినీ సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలను ఆదుకోవాలి" అని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ముఖ్యంగా రైతులను ఆదుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చంద్రబాబు నొక్కి చెప్పారు. "నీట మునిగిన పంటలను ఏ మేరకు కాపాడగలమో చూడాలి. దీనిపై వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులతో కలిసి అధ్యయనం చేయాలి. పంట మట్టిపాలు కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాలి. పడిపోయిన కొబ్బరి చెట్లు సహా ఇతర ఉద్యాన పంటల మొక్కలను తిరిగి నాటే అవకాశాలు ఉన్నాయేమో పరిశీలించాలి" అని సూచించారు.
వ్యవసాయ, ఉద్యాన రైతులకు వాటిల్లిన నష్టాన్ని భర్తీ చేసేందుకు వివిధ ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలని, పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేసేందుకు టెక్నాలజీని వినియోగించుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం చేస్తున్న పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం ద్వారా వారి సహకారం పొందాలని ఆయన పేర్కొన్నారు.