ఏపీ తీరంపై అర్నాబ్ విలయం.. 150 కి.మీ. వేగంతో గాలులు, కుండపోత వర్షాలు

Andhra
Advertisement
  • యానాం వద్ద తీరం దాటడం ప్రారంభించిన అర్నాబ్ అతి తీవ్ర తుపాను
  • గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు
  • భారీ వర్షాలతో కోస్తా జిల్లాలు అతలాకుతలం.. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం
  • వేగంగా సహాయక చర్యలు.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు
  • ఇంకా కొన్ని గంటల పాటు కొనసాగనున్న తీరం దాటే ప్రక్రియ
Advertisement
'అర్ణబ్' అతి తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. బుధవారం తెల్లవారుజామున బాపట్ల-విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో తీరం దాటడం ప్రారంభించిన ఈ తుపాను.. ప్రస్తుతం కాకినాడ, యానాం పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తుండగా, కొన్ని సమయాల్లో గాలి వేగం గంటకు 150 కిలోమీటర్లకు చేరుకుంటోందని భారత వాతావరణ శాఖ  వెల్లడించింది.

తుపాను గంటకు కేవలం 3 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా కదులుతోంది. ఈ నేపథ్యంలో తీరం దాటే ప్రక్రియ మరో మూడు గంటల పాటు కొనసాగవచ్చని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, భయంకరమైన సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో సముద్రపు అలలు 1.5 నుంచి 2.5 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం ఉందని విశాఖ ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా కాకినాడ, యానాం, గోదావరి నదీ ముఖద్వారం వద్ద దీని ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది.

తుపాను తీవ్రత దృష్ట్యా కాకినాడ పోర్టులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరికను, విశాఖపట్నం, గంగవరం, భీమునిపట్నం పోర్టులలో 9వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇప్పటికే తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. యానాం సమీపంలోని జాతీయ రహదారి 216పై బలమైన గాలులకు చెట్లు కూలిపోయాయి. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుపాను పరిస్థితిని ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా ఏపీలోని మూడు విమానాశ్రయాల్లో విమాన సర్వీసులను రద్దు చేశారు. తుపాను పూర్తిగా తీరం దాటి బలహీనపడే వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, సముద్ర తీరానికి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

More Telugu News

బిహార్‌లో ప్రశాంత్ కిశోర్ పార్టీకి తొలి విజయం.. శాసనమండలిలో బోణీ

28 Oct, 09:14

ఉద్రిక్తతల నడుమ పాక్‌కు భారత్ ఆహ్వానం.. ఎస్‌సీఓ సదస్సుకు రావాలని పిలుపు

28 Oct, 09:07

కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్.. క్లీన్‌స్వీప్ చేసిన ఎన్డీయే

28 Oct, 08:56

కోనసీమ జిల్లాను కుదిపేసిన 'అర్న‌బ్‌'.. అపార నష్టం

28 Oct, 08:47

అర్నబ్ తుపాను: రాత్రంతా సీఎం చంద్రబాబు సమీక్షలు

28 Oct, 08:42

టీ20 క్రికెట్‌లో భారత పేసర్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్

28 Oct, 08:29

సూడాన్‌లో మార్కెట్‌పై జరిగిన డ్రోన్ దాడిలో 100 మందికి పైగా మృతి

28 Oct, 08:17

'170 కష్టమన్నాడు'.. భారత్ ఊచకోత.. చోప్రాపై ట్రోల్స్ వర్షం

28 Oct, 08:12

ధరల భారం నుంచి ఊరట.. ఇక బియ్యంతో పాటు నిత్యావసరాలు!

28 Oct, 07:52

అర్నబ్ తుపాను ఎఫెక్ట్: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రైళ్లు, విమానాల రద్దు

28 Oct, 07:31

వాళ్ల బ్యాటింగ్ చూసి కళ్లు చెదిరాయి: భారత ఓపెనర్లపై శ్రేయస్ ప్రశంసలు

28 Oct, 07:18

ఇజ్రాయెల్ ఎన్నికల్లో హంగ్: నెతన్యాహుకు షాక్.. ప్రతిపక్షాలదే స్వల్ప పైచేయి

28 Oct, 06:45

న్యూజిలాండ్ జట్టు కంటే మా వాళ్లే నయం: శామీ

27 Oct, 22:39

జాన్వీ కపూర్ కు అండగా నిలిచేందుకు.. లండన్ లో చదువు వదిలేసి వచ్చాడు!

27 Oct, 21:59
..More Telugu News