'ఎస్ఐఆర్'పై కాంగ్రెస్ వైఖరిని నిలదీసిన సీఎం చంద్రబాబు

Andhra
Advertisement
  • ఈవీఎంలపై కాంగ్రెస్ ది ద్వంద్వ వైఖరి అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు
  • గెలిచినప్పుడు ఒకలా, ఓడినప్పుడు మరోలా మాట్లాడటం సరికాదని విమర్శ
  • కొన్ని జాతీయ పార్టీల తీరు గొడ్డలి పార్టీ నేత తీరు ఒకలాగే ఉందని పరోక్ష వ్యాఖ్య
  • గత పాలకుల తప్పులు సరిదిద్దడానికే మూడేళ్లు పట్టిందని వెల్లడి
  • ప్రజల పట్ల, అభివృద్ధి పట్ల తమది భయం కాదు బాధ్యత అని స్పష్టీకరణ
Advertisement
ఎన్నికల యంత్రాంగం, ఎస్ఐఆర్, ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. గెలిచినప్పుడు ఈవీఎంలు కరెక్ట్ అని, ఓడిపోయినప్పుడు మాత్రం వాటిపై నిందలు వేయడం ఆ పార్టీకి పరిపాటిగా మారిందని విమర్శించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో కలిసి చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "రాజ్యాంగబద్ధమైన వ్యవస్థగా ఎన్నికల కమిషన్ ది ఎప్పుడూ ఒకే విధానం. సీఈసీ విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరులు అనుసరిస్తున్నాయి. 'సర్'పై ఒకచోట ఒక వైఖరి, మరో చోట మరోవైఖరి అవలంభిస్తారా..?  ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ.. గెలిస్తే ఈవీఎంలు సక్రమంగా ఉన్నట్టు, అదే ఓటమి పాలైతే ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించడం సరైనదేనా? ఇది ఎక్కడి వైఖరి?" అని తీవ్రంగా ప్రశ్నించారు. ఇదే ఈవీఎంలతో గెలిచిన విషయాన్ని ఆ పార్టీలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కేవలం కేంద్రంపై, రాష్ట్రాలపై బురద చల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

జాతీయ స్థాయిలో కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్న తీరు, రాష్ట్రంలోని 'గొడ్డలి పార్టీ' నేత తీరు ఒకేలా ఉందని చంద్రబాబు పరోక్షంగా వ్యాఖ్యానించారు. తనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా వ్యవహరించడం కొందరికి అలవాటైందని ఆయన దుయ్యబట్టారు. "ఒక వ్యక్తి వైఖరి వల్ల రాష్ట్రం ఎందుకు నష్టపోవాలి? రప్పరప్పా రాజకీయాలు చేసి ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తారా? గతంలో రాజకీయాల్లోకి రౌడీలు వస్తే ప్రజలు గమనించేవారు, కానీ ఇప్పుడు రౌడీలే రాజకీయం చేస్తున్నారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గత పాలకులు చేసిన అవకతవకలను సరిదిద్దడానికే తమకు మూడేళ్ల సమయం పట్టిందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని, దేశాన్ని నిర్మించాలంటే సమర్థవంతమైన నాయకత్వం అవసరమని, ఎన్డీఏ ప్రభుత్వం ఆ దిశగానే నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ప్రజల పట్ల, రాష్ట్రాభివృద్ధి పట్ల తమకు ఉన్నది భయం కాదని, బాధ్యత అని ఆయన పునరుద్ఘాటించారు.


Advertisement

సంబంధిత వార్తలు

Chandrababu NaiduCongress PartyEVM Tampering AllegationsElection CommissionPawan KalyanAndhra Pradesh Politics

More Telugu News

సామాన్యులకు చంద్రబాబు సర్కారు భారీ ఊరట.. తక్కువ ధరకే నిత్యావసరాలు

27 Oct, 21:35

తింటే చాలు.. కళ్లముందు బుల్లి మనుషుల ప్రపంచం.. వెలుగులోకి వింత పుట్టగొడుగు!

27 Oct, 21:27

తుపాను ఒక్కోసారి దిశ మార్చుకుంటుంది.. అందుకే ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం: సీఎం చంద్రబాబు

27 Oct, 21:06

నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త.. 1,265 స్టేషన్ మాస్టర్ పోస్టులకు నోటిఫికేషన్

27 Oct, 20:49

జగన్ ఉడత బెదిరింపులకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరు: మంత్రి అచ్చెన్నాయుడు

27 Oct, 20:16

సందీప్ కిషన్ 'పవర్ పేట'.. 'పడమటి వీధి జానకి'గా రితికా నాయక్.. ఓ రేంజిలో గ్లామర్!

27 Oct, 20:07

పులివెందులలో టీడీపీ కూటమి ప్రభంజనం.. 20 వార్డుల్లో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవం!

27 Oct, 19:58

ఇలాంటి బ్యాటింగ్ ఎప్పుడూ చూడలేదన్న అయ్యర్.. వాళ్లను ఆపడం కష్టమన్న శాంట్నర్

27 Oct, 19:28

ఏపీ లిక్కర్ స్కామ్: రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

27 Oct, 19:27

లిటిగేషన్లే ఆ పార్టీ రాజకీయం.. మా రెండున్నరేళ్ల కష్టాన్ని గుర్తించండి: సీఎం చంద్రబాబు

27 Oct, 18:54

మీరు 2.0 అంటే... మేం 10X చూపిస్తాం: జగన్‌కు పవన్ కల్యాణ్ వార్నింగ్

27 Oct, 18:53

రజనీకాంత్ ‘జైలర్ 2’.. హృతిక్ రోషన్ ‘రోడీ థీమ్’ విడుదల

27 Oct, 18:26

నామినేషన్లు వేయడానికి యుద్ధం చేయాల్సి వస్తోంది: వైఎస్ అవినాశ్ రెడ్డి

27 Oct, 18:14

జర్నలిజానికి డేటా చట్టం ముప్పు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థలు

27 Oct, 18:08
..More Telugu News