కేటీఆర్, హరీశ్‌ రావు భ్రమల్లో ఉన్నారు: మహేశ్ గౌడ్

Telangana
Advertisement
  • వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుస్తుందని మహేశ్ గౌడ్ ధీమా
  • తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని వ్యాఖ్య
  • ఆలోచన లేకుండా అప్పులు చేసి కేసీఆర్ రాష్ట్రాన్ని ముంచారని ఆరోపణ
Advertisement
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌ రావు ఇంకా భ్రమల్లోనే జీవిస్తున్నారని, క్షేత్రస్థాయి వాస్తవాలను వారు గ్రహించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుచుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మేధావి అని చెప్పుకునే కేసీఆర్ ఎలాంటి ఆలోచన లేకుండా అప్పులు చేశారని మహేశ్ గౌడ్ విమర్శించారు. ఎల్ నినో ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటే, దాని గురించి హరీశ్ రావు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, 90,000 ఉద్యోగాలు పొందిన ప్రతి లబ్ధిదారుడు కాంగ్రెస్‌కే ఓటు వేస్తారని... క్షేత్రస్థాయిలో తమ పార్టీ బలంగా ఉందని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని... దేశంలో ఎక్కడా లేనంతగా తమ పార్టీలో సమన్వయం ఉందని మహేశ్ గౌడ్ తెలిపారు. నవంబర్‌లో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ఆ తర్వాత తమ ప్రత్యక్ష లక్ష్యం ఎన్నికలేనని స్పష్టం చేశారు. 

రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని, ఆ పార్టీ పని అయిపోయిందని జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఉన్న 8 ఎంపీ సీట్లలో రెండు కూడా గెలవడం కష్టమేనని.. మరోవైపు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో ఒక్కరు కూడా గెలవరని అన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 40 శాతం సీట్లు తమకే వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


Advertisement

సంబంధిత వార్తలు

Mahesh Kumar GoudTPCC PresidentTelangana CongressKTR Harish RaoTelangana Assembly ElectionsRevanth Reddy

More Telugu News

రజనీకాంత్ ‘జైలర్ 2’.. హృతిక్ రోషన్ ‘రోడీ థీమ్’ విడుదల

27 Oct, 18:26

నామినేషన్లు వేయడానికి యుద్ధం చేయాల్సి వస్తోంది: వైఎస్ అవినాశ్ రెడ్డి

27 Oct, 18:14

జర్నలిజానికి డేటా చట్టం ముప్పు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థలు

27 Oct, 18:08

పోలింగ్ రోజున పులివెందులలో ఉంటా.. భయపడొద్దు.. తిరగబడండి: జగన్

27 Oct, 18:04

'అంజాన్ సాయే' ( నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!

27 Oct, 17:38

మొదలైన తుపాను ప్రభావం.. విశాఖలో విరిగిపడుతున్న చెట్లు, ఉత్తరాంధ్రలో హై అలర్ట్

27 Oct, 17:34

సార్.. తమరు అద్భుతంగా ఆడారు: శిష్యుడి సెంచరీపై యువీ కామెంట్

27 Oct, 17:16

‘‘ఫ్రీ బస్సు ఎక్కి భార్య వెళ్లిపోయింది’’.. పథకం రద్దు చేయాలంటూ ఎమ్మెల్యేకు వ్యక్తి వినతి!

27 Oct, 17:12

ఇండియాలోనే అసెంబ్లీ.. లగ్జరీ ఎస్‌యూవీపై ఇప్పుడు రూ.34 లక్షలు తగ్గింపు!

27 Oct, 16:47

తుమ్మిడిహెట్టి చర్చలు పెద్ద డ్రామా: బాల్క సుమన్

27 Oct, 16:44

మా ప్లాన్ చాలా సింపుల్.. వైభవ్ తో ఓపెనింగ్ పై అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

27 Oct, 16:24

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. ఫార్మా, రియల్టీ షేర్లలో జోరు!

27 Oct, 16:23

దుబాయ్ ఐఫోన్ కోసం కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి నిరసన.. అసలేం జరిగింది?

27 Oct, 16:13

కాకినాడకు 167 కి.మీ. దూరంలో 'అర్ణబ్.. అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం

27 Oct, 15:55
..More Telugu News