ఇండియాలోనే అసెంబ్లీ.. లగ్జరీ ఎస్‌యూవీపై ఇప్పుడు రూ.34 లక్షలు తగ్గింపు!
Advertisement
- ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధర గరిష్ఠంగా రూ.34 లక్షల వరకు తగ్గింపు
- భారత్‌లోనే డిఫెండర్ 110 స్థానిక అసెంబ్లీ ప్రారంభం
- విడిభాగాలను దిగుమతి చేసుకుని అసెంబ్లీ
- మూడు ఇంజిన్ ఆప్షన్లతో డిఫెండర్ 110 అందుబాటులోకి
- దిగుమతి ఖర్చులు తగ్గడం ధర తగ్గింపునకు ప్రధాన కారణం
Advertisement
లగ్జరీ ఎస్‌యూవీ కొనాలనుకునేవారికి శుభవార్త. ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధరలు భారీగా తగ్గాయి. భారత్‌లోనే వాహనాల అసెంబ్లీ ప్రారంభం కావడంతో కొన్ని వేరియంట్ల ధరలు గణనీయంగా తగ్గాయి. గరిష్ఠంగా రూ.34 లక్షల వరకు ధర తగ్గడం విశేషం.
ఇప్పటి వరకు జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) డిఫెండర్ 110 మోడల్‌ను పూర్తిగా విదేశాల్లో తయారు చేసి భారత్‌కు దిగుమతి చేసుకునేది. ఈ విధానానికి స్వస్తి పలికిన కంపెనీ విడిభాగాలను దిగుమతి చేసుకుని భారత్‌లోనే అసెంబ్లీ చేయడం ప్రారంభించింది. దీంతో దిగుమతి ఖర్చులు తగ్గి వాహనం ధరను తగ్గించేందుకు అవకాశం ఏర్పడింది.
డిఫెండర్ 110 వేరియంట్ మూడు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులోకి వస్తోంది. అయితే, అన్ని డిఫెండర్ వేరియంట్లకూ ఒకే స్థాయిలో ధర తగ్గింపు వర్తించదు.
భారత్‌లో రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడళ్లను స్థానికంగా అసెంబ్లీ చేయడం ద్వారా జేఎల్‌ఆర్ గతంలోనూ ధరలను తగ్గించింది. అదే విధానాన్ని ఇప్పుడు డిఫెండర్ 110కు విస్తరించడం ద్వారా భారత లగ్జరీ ఎస్‌యూవీ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని సంస్థ భావిస్తోంది.
డిఫెండర్ 110లో 13.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ఆఫ్‌రోడింగ్ కోసం ఆల్ వీల్ డ్రైవ్, టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్, హిల్ డిసెంట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ అందించారు. 3డీ సరౌండ్ కెమెరా, పార్కింగ్ అసిస్టెన్స్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వంటి డ్రైవర్ సహాయక ఫీచర్లు కూడా వేరియంట్‌ను బట్టి లభిస్తాయి.
సుమారు 900 మిల్లీమీటర్ల లోతు వరకు నీటిలో ప్రయాణించగల సామర్థ్యం ఈ ఎస్‌యూవీ ప్రత్యేకత. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఎంపికలతో పాటు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉండటం వల్ల రహదారులపైనే కాకుండా కఠినమైన భూభాగాల్లోనూ ప్రయాణించేందుకు ఇది అనుకూలంగా ఉంటుంది.