దుబాయ్ ఐఫోన్ కోసం కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి నిరసన.. అసలేం జరిగింది?

National
Advertisement
  • దుబాయ్ నుంచి తెచ్చిన 'ఐఫోన్ 18 ప్రో'ను సీజ్ చేసిన కస్టమ్స్
  • దిగుమతి సుంకం చెల్లించేందుకు నిరాకరించిన ప్రయాణికుడు
  • కొచ్చి విమానాశ్రయంలో బైఠాయించి నిరసన తెలిపిన యువకుడు
  • అధికారుల విధులకు ఆటంకం కలిగించాడని కేసు నమోదు
Advertisement
దుబాయ్ లో కొనుగోలు చేసిన సరికొత్త 'ఐఫోన్ 18 ప్రో'ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేయడంతో ఓ ప్రయాణికుడు కొచ్చిలోని నెడుంబస్సేరి విమానాశ్రయంలో నిరసనకు దిగాడు. దిగుమతి సుంకం (ఇంపోర్ట్ డ్యూటీ) చెల్లింపు విషయంలో తలెత్తిన వివాదంతో అతను అక్కడే బైఠాయించి ధర్నా చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై అధికారులు అతనిపై కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. కోజికోడ్‌కు చెందిన అజాస్ మహ్మద్, ఎడ్యుపోర్ట్ అనే లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ వ్యవస్థాపకుడు. ఇటీవల దుబాయ్ నుంచి కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న కొత్త ఐఫోన్ 18 ప్రోకు దిగుమతి సుంకం చెల్లించాలని కస్టమ్స్ అధికారులు కోరారు. 

అయితే, ఆ ఫోన్‌ను తన వ్యక్తిగత అవసరాల కోసమే తెచ్చుకున్నానని, దానికి సుంకం చెల్లించాల్సిన అవసరం లేదని అజాస్ వాదించాడు. తన వద్ద ఇప్పటికే మరో ఫోన్ ఉందని అధికారులు సుంకం డిమాండ్ చేస్తున్నారని ఆరోపించాడు.

తాను "అన్యాయంగా ఒక్క రూపాయి కూడా కట్టబోనని" స్పష్టం చేశాడు. తనలాగే కొత్త ఫోన్లు తెచ్చుకున్న ఇతర ప్రయాణికులు రూ.20,000 నుంచి రూ.30,000 వరకు సుంకం చెల్లించారని, కానీ తాను మాత్రం అన్యాయమైన పన్ను కట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. ఫోన్‌ను తిరిగి ఇచ్చేంతవరకు శాంతియుతంగా విమానాశ్రయంలోనే నిరసన తెలుపుతానని అక్కడే బైఠాయించాడు. 

దీంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది అతన్ని అక్కడి నుంచి పక్కకు తరలించారు. అనంతరం కస్టమ్స్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో నెడుంబస్సేరి పోలీసులు అజాస్‌పై కేసు నమోదు చేశారు.

మరోవైపు, కస్టమ్స్ అధికారులు అజాస్ వాదనను అంగీకరించలేదు. అతని వద్ద ఇప్పటికే మరో ఐఫోన్ ఉండటం, కొత్తగా తెచ్చిన హ్యాండ్‌సెట్ రిజిస్టర్ కాకపోవడం వంటి కారణాలతో అది వ్యక్తిగత వినియోగానికి కాదని భావించారు. భారత బ్యాగేజ్ రూల్స్-2026 ప్రకారం అర్హులైన ప్రయాణికులు సుమారు రూ.75,000 విలువైన వస్తువులను సుంకం లేకుండా దేశంలోకి తీసుకురావచ్చు. 

ఈ పరిమితిని అధికారులు ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే, ఈ నిర్దిష్ట కేసులో ఫోన్‌ను సీజ్ చేయడానికి గల కచ్చితమైన చట్టపరమైన కారణాలపై కస్టమ్స్ విభాగం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఈ వివాదం కొనసాగుతోంది.
Advertisement

సంబంధిత వార్తలు

Ajas MohammedKochi AirportiPhone 18 ProCustoms Import DutyDubai iPhone SeizureNedumbassery Police

More Telugu News

సార్.. తమరు అద్భుతంగా ఆడారు: శిష్యుడి సెంచరీపై యువీ కామెంట్

27 Oct, 17:16

కేటీఆర్, హరీశ్‌ రావు భ్రమల్లో ఉన్నారు: మహేశ్ గౌడ్

27 Oct, 17:15

‘‘ఫ్రీ బస్సు ఎక్కి భార్య వెళ్లిపోయింది’’.. పథకం రద్దు చేయాలంటూ ఎమ్మెల్యేకు వ్యక్తి వినతి!

27 Oct, 17:12

ఇండియాలోనే అసెంబ్లీ.. లగ్జరీ ఎస్‌యూవీపై ఇప్పుడు రూ.34 లక్షలు తగ్గింపు!

27 Oct, 16:47

తుమ్మిడిహెట్టి చర్చలు పెద్ద డ్రామా: బాల్క సుమన్

27 Oct, 16:44

మా ప్లాన్ చాలా సింపుల్.. వైభవ్ తో ఓపెనింగ్ పై అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

27 Oct, 16:24

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. ఫార్మా, రియల్టీ షేర్లలో జోరు!

27 Oct, 16:23

కాకినాడకు 167 కి.మీ. దూరంలో 'అర్ణబ్.. అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం

27 Oct, 15:55

కొత్తగా రూ.1,000 నోటు వస్తోందా? వైరల్‌ వార్తలపై కేంద్రం కీలక ప్రకటన

27 Oct, 15:50

భారత్‌లో అతిపెద్ద జిల్లా ఇదే.. కొన్ని రాష్ట్రాలు, దేశాల కన్నా పెద్దది!

27 Oct, 15:48

వెల్లింగ్టన్‌లో అభిషేక్ సునామీ.. రికార్డుల మోతతో సిరీస్ భారత్ కైవసం

27 Oct, 15:45

అభి‘షేకింగ్‌’.. టీ20ల్లో చరిత్ర సృష్టించిన టీమిండియా

27 Oct, 15:26

నా బయోపిక్ నిజం కాదు.. అందులో చూపించింది 10 శాతమే.. అసలు కథ వేరు: మేరీ కోమ్

27 Oct, 15:19

అర్ణబ్ ఎఫెక్ట్.. ఉత్తరాంధ్రలో పూర్తిగా మారిన వాతావరణం

27 Oct, 15:08
..More Telugu News