కాకినాడకు 167 కి.మీ. దూరంలో 'అర్ణబ్.. అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం
Advertisement
- అర్ణబ్ తుపాను ముప్పుపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
- కాకినాడ సమీపంలో కేంద్రీకృతమైన తుపాను
- లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని కలెక్టర్లకు ఆదేశం
- సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాల వినియోగం
- విద్యుత్, రవాణా పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచన
Advertisement
బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్ణబ్' తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రస్తుత పరిస్థితి, ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధత, ముందస్తు చర్యలపై అధికారులకు ఆయన కీలక దిశానిర్దేశం చేశారు.
ప్రస్తుతం ఈ తుపాను కాకినాడ సమీపంలోని యానాంకు 167 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, గత ఆరు గంటలుగా గంటకు 23 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాలపై తుపాను ప్రభావం, భారీ వర్షాల హెచ్చరికల గురించి సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడటమే ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో బాధితులకు అవసరమైన ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని, ఈదురు గాలులకు చెట్లు, హోర్డింగులు కూలిపోతే తక్షణమే తొలగించి రవాణాకు ఆటంకాలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, తక్షణమే స్పందించాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.