వెల్లింగ్టన్‌లో అభిషేక్ సునామీ.. రికార్డుల మోతతో సిరీస్ భారత్ కైవసం

Sports
Advertisement
  • కివీస్‌పై మూడో టీ20లో టీమిండియా ఘన విజయం
  • యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ 38 బంతుల్లోనే 113 పరుగులు
  • పవర్‌ప్లేలో 118 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన భారత్
  • ఈ విజయంతో 3-0 తేడాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా
  • భారీ లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే ఛేదించిన భారత జట్టు
Advertisement
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. పరుగుల సునామీ సృష్టిస్తూ కేవలం 38 బంతుల్లోనే 9 ఫోర్లు, 11 సిక్సర్ల సహాయంతో 113 పరుగులు చేయగా, టీమిండియా మరపురాని విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. కివీస్ నిర్దేశించిన 199 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత బ్యాటర్లు ఊది పారేశారు. అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఈ భారీ స్కోరు కూడా చిన్నబోయింది.

ఈ పోరులో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ బ్యాటర్లు మెరుగైన ఆటతీరు కనబర్చారు. డారిల్ మిచెల్ (52 బంతుల్లో 89 నాటౌట్), ఫిన్ అలెన్ (25 బంతుల్లో 40) మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆతిథ్య నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, నితీశ్ రెడ్డి తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ (19 బంతుల్లో 45) కివీస్ బౌలర్లను ఊచకోత కోశారు. వీరిద్దరూ పవర్‌ప్లేలోనే టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. తొలి 6 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 118 పరుగులు జోడించారు. ఇది టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక పవర్‌ప్లే స్కోరు కావడం విశేషం. ఈ క్రమంలో రొమేనియా (116/0) రికార్డును భారత్ బద్దలుకొట్టింది. కేవలం 2.2 ఓవర్లలోనే 50 పరుగులు, 5 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసి పలు రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.

తొలి వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యం తర్వాత వైభవ్ ఔటైనా, అభిషేక్ తన జోరు కొనసాగించాడు. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం అభిషేక్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (5), సంజూ శాంసన్ (18) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. చివర్లో తిలక్ వర్మ (1), నమన్ ధీర్ (4) లాంఛనాన్ని పూర్తి చేశారు. దీంతో టీమిండియా కేవలం 13.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో సిరీస్‌ను భారత్ 3-0 చేజిక్కించుకోగా, మిగిలిన రెండు మ్యాచ్‌లు నామమాత్రం కానున్నాయి. అభిషేక్ శర్మకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
Advertisement

సంబంధిత వార్తలు

Abhishek SharmaIndia vs New Zealand T20Abhishek Sharma centuryIndia T20 series winHighest T20 Powerplay scoreWellington T20 match

More Telugu News

సార్.. తమరు అద్భుతంగా ఆడారు: శిష్యుడి సెంచరీపై యువీ కామెంట్

27 Oct, 17:16

కేటీఆర్, హరీశ్‌ రావు భ్రమల్లో ఉన్నారు: మహేశ్ గౌడ్

27 Oct, 17:15

‘‘ఫ్రీ బస్సు ఎక్కి భార్య వెళ్లిపోయింది’’.. పథకం రద్దు చేయాలంటూ ఎమ్మెల్యేకు వ్యక్తి వినతి!

27 Oct, 17:12

ఇండియాలోనే అసెంబ్లీ.. లగ్జరీ ఎస్‌యూవీపై ఇప్పుడు రూ.34 లక్షలు తగ్గింపు!

27 Oct, 16:47

తుమ్మిడిహెట్టి చర్చలు పెద్ద డ్రామా: బాల్క సుమన్

27 Oct, 16:44

మా ప్లాన్ చాలా సింపుల్.. వైభవ్ తో ఓపెనింగ్ పై అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

27 Oct, 16:24

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. ఫార్మా, రియల్టీ షేర్లలో జోరు!

27 Oct, 16:23

దుబాయ్ ఐఫోన్ కోసం కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి నిరసన.. అసలేం జరిగింది?

27 Oct, 16:13

కాకినాడకు 167 కి.మీ. దూరంలో 'అర్ణబ్.. అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం

27 Oct, 15:55

కొత్తగా రూ.1,000 నోటు వస్తోందా? వైరల్‌ వార్తలపై కేంద్రం కీలక ప్రకటన

27 Oct, 15:50

భారత్‌లో అతిపెద్ద జిల్లా ఇదే.. కొన్ని రాష్ట్రాలు, దేశాల కన్నా పెద్దది!

27 Oct, 15:48

అభి‘షేకింగ్‌’.. టీ20ల్లో చరిత్ర సృష్టించిన టీమిండియా

27 Oct, 15:26

నా బయోపిక్ నిజం కాదు.. అందులో చూపించింది 10 శాతమే.. అసలు కథ వేరు: మేరీ కోమ్

27 Oct, 15:19

అర్ణబ్ ఎఫెక్ట్.. ఉత్తరాంధ్రలో పూర్తిగా మారిన వాతావరణం

27 Oct, 15:08
..More Telugu News