అర్ణబ్ ఎఫెక్ట్.. ఉత్తరాంధ్రలో పూర్తిగా మారిన వాతావరణం
Advertisement
- పశ్చిమమధ్య బంగాళాఖాతంలో బలపడిన 'అర్ణబ్' తుపాను
- గంటకు 20 కి.మీ వేగంతో ఏపీ తీరం వైపు వేగంగా కదులుతున్న అతి తీవ్ర తుపాను
- రేపు ఉదయం బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం
- తీరం దాటే సమయంలో గంటకు 125-135 కి.మీ. వేగంతో గాలులు
- కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక
Advertisement
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్ణబ్' అతి తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుపాను, ప్రస్తుతం విశాఖపట్నానికి 170 కి.మీ., కాకినాడకు 180 కి.మీ., మచిలీపట్నానికి 270 కి.మీ., బాపట్లకు 350 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది.
'అర్నబ్' ప్రభావంతో ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు సాయంత్రం నుంచి పోలవరం, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తుపాను రేపు (బుధవారం) ఉదయానికి బాపట్ల-విశాఖపట్నం మధ్య, యానాంకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ, "తుపాను తీరం దాటే సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి" అని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అధికార యంత్రాంగం సహాయక చర్యల కోసం సర్వసన్నద్ధంగా ఉంది.