బడులు పెట్టి చేతులు దులుపుకొంటే సరిపోదు.. రేవంత్ సర్కార్‌పై ఆకునూరి మురళి తీవ్ర విమర్శలు
Advertisement
- విద్యా వ్యవస్థలో లోపాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ ఐఏఎస్
- పిల్లల భద్రతపై ప్రభుత్వానికి నిబద్ధత ఉండాలంటూ వ్యాఖ్యలు
- తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్
- విద్యా బడ్జెట్ పెంచాలని, స్కూల్ బస్సులు ఏర్పాటు చేయాలని సూచన
- ఐదేళ్ల విద్యా ప్రణాళిక అమలు చేయాలని విజ్ఞప్తి
Advertisement
ఖమ్మం జిల్లాలో ఐదేళ్ల చిన్నారి ధనశ్రీ మృతి ఘటనపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో పిల్లలకు సరైన వసతులు, భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేశారు. పిల్లల విద్య, భద్రత విషయంలో ప్రభుత్వానికి అవసరమైన నిబద్ధత కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.
ఖమ్మం జిల్లా కేవీపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో విషకీటకం కుట్టడంతో ఐదేళ్ల ధనశ్రీ మృతి చెందిన ఘటనపై మురళి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘సారీ తల్లీ ధనశ్రీ.. నిన్ను ఈ ప్రపంచానికి దూరం చేసుకున్నాం. అన్ని బడుల్లో మంచి వసతులతో కూడిన ప్రీప్రైమరీ తరగతులు, గదులు ఉండి ఉంటే నువ్వు ఈ రోజు బతికి ఉండేదానివి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
పిల్లల విద్య, భద్రత ప్రభుత్వానికి ప్రాధాన్య అంశాలు కావాలని ఆకునూరి మురళి సూచించారు. కనీస సౌకర్యాలు లేని ప్రీప్రైమరీ పాఠశాలలను ప్రారంభించి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలోని 60 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా కమిషన్ సిఫార్సుల ప్రకారం నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులతో తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు విద్యా బడ్జెట్‌ను పెంచాలని, విద్యార్థుల సౌకర్యార్థం స్కూల్ బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తక్షణమే ఐదేళ్ల ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కోరారు.
మరోవైపు, అంగన్‌వాడీ టీచర్ స్థానికంగా ఉండకపోవడం, నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి మృతి చెందిందని స్థానికులు ఆరోపించారు. టీచర్‌పై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులతో కలిసి టేకులపల్లి రహదారిపై ఆందోళన చేపట్టారు. ఈ నిరసనకు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.