ఆగర్భ శత్రువులను సైతం పెళ్లి వేడుక కలుపుతుంది.. కానీ జగన్ మాత్రం..!: బుద్ధా వెంకన్న

25-10-2026 Sun 17:31 | Andhra | By
Advertisement
  • మేనకోడలు పెళ్లికి అడ్డుపడుతున్న కలియుగ కంసమామ జగన్ అంటూ బుద్ధా విమర్శలు
  • దౌర్జన్యాలు, దాడులే వైసీపీ రాజకీయ అస్త్రాలని తీవ్ర విమర్శ
  • 2021 స్థానిక ఎన్నికల్లో వైసీపీ విధ్వంసాలు సృష్టించిందన్న బుద్ధా
  • ఓటమి భయంతోనే ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు కుట్రలని ఆరోపణ
  • వేల నామినేషన్లు వేసి, అడ్డుకుంటున్నారని వైసీపీ దొంగ ఏడుపులు ఏడుస్తోందని ఎద్దేవా
Advertisement
వైసీపీ అధినేత జగన్ తన సొంత మేనకోడలు పెళ్లికి అడ్డుపడుతూ కలియుగ కంసమామలా వ్యవహరిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తండ్రి తర్వాత తండ్రిలాంటి మేనమామే దగ్గరుండి పెళ్లి చేయాల్సిన బాధ్యతను మరిచి, భద్రత పేరుతో వివాహ వేదికకు స్థలం ఇవ్వకుండా అడ్డుకోవడం జగన్ దుర్మార్గపు మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. 

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆగర్భ శత్రువులను సైతం పెళ్లి వేడుక కలుపుతుందని, కానీ వివాహ సంప్రదాయాలపై జగన్‌కు ఏమాత్రం నమ్మకం లేదని విమర్శించారు. ఆస్తి కోసం సొంత చెల్లిని, కన్నతల్లిని ఇంటి నుంచి గెంటేసిన వ్యక్తి ప్రపంచంలో ఎవరూ ఉండరని, అలాంటి వ్యక్తికి మానవతా విలువలు ఎక్కడివని ప్రశ్నించారు. జగన్‌కు రాజకీయ విలువలతో పాటు, కనీస కుటుంబ విలువలు కూడా లేవని ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు.

దౌర్జన్యాలు, దాడులే జగన్ రాజకీయం

దౌర్జన్యాలు, అక్రమాలు, దాడులే జగన్ కు తెలిసిన రాజకీయమని బుద్ధా వెంకన్న ఆరోపించారు. బిందెడు పాలలో విషపు చుక్క వేసినట్లు, రాష్ట్ర అభివృద్ధిలో జగన్ విషపు చుక్కలు వేశారని దుయ్యబట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుంటే, ఓటమి భయంతో అల్లర్లు సృష్టించి ఎన్నికలను అడ్డుకోవాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. 

ఒకవైపు కూటమి పార్టీలకు పోటీగా వేల నామినేషన్లు దాఖలు చేసి, మరోవైపు తమను నామినేషన్లు వేయనీయడం లేదని దొంగ ఏడుపులు ఏడవడం వైసీపీకే చెల్లిందన్నారు. ఎంపీటీసీ స్థానాలకు 20,556, జడ్పీటీసీ స్థానాలకు 1,815 నామినేషన్లు వేసిన వైసీపీ, ఇప్పుడు గగ్గోలు పెట్టడం వారి డ్రామాలకు పరాకాష్ఠ అని మండిపడ్డారు. "దాడుల గురించి మాట్లాడే జగన్, 2020లో మాచర్లలో నాపై జరిగిన హత్యాయత్నాన్ని కూడా గుర్తుచేసుకోవాలి" అని బుద్ధా సూచించారు.

2021 విధ్వంసకాండను మర్చిపోలేదు

2021 స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జగన్ చెప్పడం పచ్చి అబద్ధమని బుద్ధా వెంకన్న కొట్టిపారేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ సృష్టించిన విధ్వంసకాండను దేశం మొత్తం చూసిందని గుర్తుచేశారు. 

"2020లో మాచర్లలో నాపై, బోండా ఉమాపై, హైకోర్టు న్యాయమూర్తి పీఏ కిశోర్‌పై ఇనుప రాడ్లతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. హిందూపురంలో కాంట్రాక్టింగ్ కేంద్రంపై, నెల్లూరు జిల్లా కావలిలో మా పార్టీ కార్యాలయంపై దాడులు చేశారు. పిఠాపురంలో ఏకంగా బ్యాలెట్ బాక్సులనే ఎత్తుకెళ్లిపోయారు. గుంటూరులోని మారెళ్ళవారిపాలెంలో రిగ్గింగ్ ఓట్లు వేసుకుంది మీరు కాదా?" అని ప్రశ్నించారు. 

ఆ ఎన్నికల్లో బలవంతంగా 1,045 మంది టీడీపీ అభ్యర్థులతో నామినేషన్లు ఉపసంహరింపజేశారని, 322 అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. 182 చోట్ల ఎన్నికల కోడ్ ఉల్లంఘించి, 48 హత్యాయత్నాలు, 3 హత్యలకు పాల్పడి.. ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని ఇప్పుడు చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు.
Advertisement
YS Jagan Mohan ReddyBuddha VenkannaTDP NewsAndhra Pradesh PoliticsYSRCP Election AllegationsKaliyuga Kamsamama

More Telugu News

అనుకోని ఆలింగనం.. దుకాణదారుడికి హగ్ ఇచ్చి వెళ్లిన కొండముచ్చు.. వైరల్ వీడియో ఇదిగో!

25-10-2026 Sun 18:59

యోగాలో ఇది అత్యంత శక్తిమంతమైనది, ప్రమాదకరమైనది కూడా: సద్గురు హెచ్చరిక

25-10-2026 Sun 18:48

గౌరీ పూర్తిగా నా కంట్రోల్ లో ఉండాలని భావించేవాడ్ని: షారుఖ్ ఖాన్

25-10-2026 Sun 18:39

హర్మన్ సెంచరీ, దీప్తి రికార్డు శతకం.. వడోదరలో టీమిండియా పరుగుల వెల్లువ

25-10-2026 Sun 18:33

ఏపీ వైపు దూసుకొస్తున్న 'అర్ణబ్'.. అధికారులను అప్రమత్తం చేసిన చంద్రబాబు

25-10-2026 Sun 18:24

"మేం ఏం తప్పు చేశాం?".. యూరప్ లో భారత జంటకు రూ.13 వేల ఫైన్

25-10-2026 Sun 17:19

అద్దె కట్టట్లేదు, ఏమైందని చూస్తే.. గదిలో రూ. 85 లక్షల నకిలీ నోట్లు!

25-10-2026 Sun 17:08

జగన్‌ను ఓడించి విశాఖను ప్రజలే కాపాడుకున్నారు: గంటా శ్రీనివాసరావు

25-10-2026 Sun 17:01

మెదడు ఆరోగ్యాన్ని కళ్లు, చెవులు చెప్పేస్తాయి!

25-10-2026 Sun 16:53

యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్.. దూసుకుపోతున్న 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్!

25-10-2026 Sun 16:16

విశాఖకు 870 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం.. ఐఎండీ అప్ డేట్

25-10-2026 Sun 16:05

రాహుల్ విదేశీ పర్యటనలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే: రాహుల్ పై పీవీ మనవడు ఎన్వీ సుభాష్ విమర్శలు

25-10-2026 Sun 15:49

'ఎక్స్‌'లో కొత్త ఫీచర్.. ఇక 'లైక్' బటన్‌తో డబ్బు పంపొచ్చు!

25-10-2026 Sun 15:42

టీమిండియా చేతిలో వరుసగా రెండు ఓటములపై న్యూజిలాండ్ కోచ్ ఏమన్నాడంటే..!

25-10-2026 Sun 15:33
..more