జగన్‌ను ఓడించి విశాఖను ప్రజలే కాపాడుకున్నారు: గంటా శ్రీనివాసరావు

25-10-2026 Sun 17:01 | Andhra
Advertisement
  • స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ 'సేవ్ వైజాగ్' డ్రామా అని విమర్శలు
  • మేం గూగుల్ తెస్తే.. జగన్ గంజాయి మాఫియాను ప్రోత్సహించారని ఆరోపణ 
  • రుషికొండపై రూ.500 కోట్లు ఖర్చు చేసినా అభివృద్ధిని పట్టించుకోలేదంటూ ఫైర్
  • కూటమి ప్రభుత్వంలో విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని హామీ
Advertisement
వైసీపీ నాయకులు 'సేవ్ వైజాగ్' పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలాంటి నినాదాలు చేస్తున్నారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ను, వైసీపీని ఓడించి విశాఖ నగరాన్ని ప్రజలే కాపాడుకున్నారని ఆయన అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

జగన్ ఐదేళ్ల పాలనలో విశాఖ నగరాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని గంటా ఆరోపించారు. 2014 ఎన్నికల్లో విశాఖ ప్రజలు తన తల్లిని ఎంపీగా ఓడించారనే కక్షతోనే జగన్ ఈ ప్రాంతంపై వివక్ష చూపారని అన్నారు. "మేం అధికారంలో ఉన్నప్పుడు గూగుల్ వంటి సంస్థలను ప్రోత్సహిస్తే, జగన్ రెడ్డి గంజాయి మాఫియాను పెంచి పోషించారు. విశాఖకు వచ్చిన కంపెనీలు కూడా ఆయన హయాంలో పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి" అని విమర్శించారు. రుషికొండపై విలాసవంతమైన భవనాల కోసం రూ.500 కోట్లు ఖర్చు చేసిన జగన్, నగర అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని గంటా మండిపడ్డారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ అభివృద్ధి పథంలో పయనిస్తోందని తెలిపారు. "విశాఖ రైల్వే జోన్‌కు జగన్ అడ్డుపడితే, మేం అవసరమైన స్థలం కేటాయించి దాన్ని సాధించాం. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకున్నాం. భోగాపురం ఎయిర్‌పోర్టును పూర్తి చేశాం. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉమ్మడి విశాఖ జిల్లాకు 30 టీఎంసీల నీటిని అందిస్తున్నాం" అని వివరించారు. భోగాపురం విమానాశ్రయానికి కేటాయించిన 500 ఎకరాలను కాజేయడానికి జగన్ కుట్ర చేశారని ఆరోపించారు.

విశాఖను అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తుంటే, వైసీపీ నాయకులు కుట్రలతో అడ్డుకుంటున్నారని గంటా ధ్వజమెత్తారు. గూగుల్, డేటా సెంటర్లపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఉత్తరాంధ్రకు ఉజ్వల భవిష్యత్తును అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మాదిరిగానే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీకి ఓటమి తప్పదని గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
Ganta Srinivasa RaoYS Jagan Mohan ReddyVisakhapatnam DevelopmentSave Vizag CampaignAndhra Pradesh Local Body ElectionsNorth Andhra Politics

More Telugu News

అనుకోని ఆలింగనం.. దుకాణదారుడికి హగ్ ఇచ్చి వెళ్లిన కొండముచ్చు.. వైరల్ వీడియో ఇదిగో!

25-10-2026 Sun 18:59

యోగాలో ఇది అత్యంత శక్తిమంతమైనది, ప్రమాదకరమైనది కూడా: సద్గురు హెచ్చరిక

25-10-2026 Sun 18:48

గౌరీ నా అదుపాజ్ఞల్లో ఉండాలని భావించేవాడ్ని: షారుఖ్ ఖాన్

25-10-2026 Sun 18:39

హర్మన్ సెంచరీ, దీప్తి రికార్డు శతకం.. వడోదరలో టీమిండియా పరుగుల వెల్లువ

25-10-2026 Sun 18:33

ఏపీ వైపు దూసుకొస్తున్న 'అర్ణబ్'.. అధికారులను అప్రమత్తం చేసిన చంద్రబాబు

25-10-2026 Sun 18:24

ఆగర్భ శత్రువులను సైతం పెళ్లి వేడుక కలుపుతుంది.. కానీ జగన్ మాత్రం..!: బుద్ధా వెంకన్న

25-10-2026 Sun 17:31

"మేం ఏం తప్పు చేశాం?".. యూరప్ లో భారత జంటకు రూ.13 వేల ఫైన్

25-10-2026 Sun 17:19

అద్దె కట్టట్లేదు, ఏమైందని చూస్తే.. గదిలో రూ. 85 లక్షల నకిలీ నోట్లు!

25-10-2026 Sun 17:08

మెదడు ఆరోగ్యాన్ని కళ్లు, చెవులు చెప్పేస్తాయి!

25-10-2026 Sun 16:53

యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్.. దూసుకుపోతున్న 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్!

25-10-2026 Sun 16:16

విశాఖకు 870 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం.. ఐఎండీ అప్ డేట్

25-10-2026 Sun 16:05

రాహుల్ విదేశీ పర్యటనలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే: రాహుల్ పై పీవీ మనవడు ఎన్వీ సుభాష్ విమర్శలు

25-10-2026 Sun 15:49

'ఎక్స్‌'లో కొత్త ఫీచర్.. ఇక 'లైక్' బటన్‌తో డబ్బు పంపొచ్చు!

25-10-2026 Sun 15:42

టీమిండియా చేతిలో వరుసగా రెండు ఓటములపై న్యూజిలాండ్ కోచ్ ఏమన్నాడంటే..!

25-10-2026 Sun 15:33
..more