పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51 | Entertainment
Advertisement
  • నొప్పితో బాధపడుతుంటే విజయ్ కడుపుపై నిమరడంతో పాటు చేతులు, కాళ్లు ఒత్తుతాడని వెల్లడి
  • మొదటిసారి పీరియడ్స్ వచ్చినప్పుడు శానిటరీ ప్యాడ్స్ గురించి తెలియద‌న్న ర‌ష్మిక‌
  • టవల్స్ వాడానని పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న న‌టి
  • సినీ పరిశ్రమలో ఇప్పటికీ పీరియడ్స్ సెలవుల విధానం అమలు కాకపోవడం విచారకరమని వ్యాఖ్య
  • నొప్పిని తట్టుకోవడానికి హాట్ ప్యాడ్స్, జీలకర్ర నీళ్లు వంటివి ఉపయోగిస్తానని వెల్ల‌డి
Advertisement
ప్రముఖ నటి రష్మిక మందన్న తన వ్యక్తిగత విషయాలతో పాటు నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులు, ఆ సమయంలో తన భర్త, నటుడు విజయ్ దేవరకొండ తీసుకునే శ్రద్ధ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. 

నెలసరి సమయంలో తాను తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటే, ఆ విషయం అర్థం చేసుకుని విజయ్ తనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడని రష్మిక తెలిపారు. "ఆ సమయంలో విజయ్ నాకు కడుపుపై మెల్లగా నిమరడంతో పాటు, చేతులు, కాళ్లు ఒత్తుతాడు. 'నేను ఇంతకంటే ఏం చేయలేను కదా' అని అంటుంటాడు. అతను అలా పక్కన ఉండటం ఎంతో ఓదార్పునిస్తుంది" అని ఆమె వివరించారు. 

పీరియడ్స్ రావడానికి కొన్ని రోజుల ముందే, తాను కారణం లేకుండా నీరసంగా ఉన్నానంటూ విజయ్‌కు ముందుగానే సమాచారం ఇస్తానని రష్మిక చెప్పారు. పురుషులకు ఈ విషయాలపై పూర్తి అవగాహన ఉండకపోయినా, విజయ్ తనను అర్థం చేసుకోవడం గొప్ప విషయమని ఆమె అన్నారు.

ఇదే సందర్భంగా, తనకు మొదటిసారి రుతుస్రావం అయినప్పటి అనుభవాన్ని కూడా రష్మిక గుర్తుచేసుకున్నారు. "అప్పుడు నాకు చాలా భయమేసింది. ఎవరితోనూ చెప్పలేకపోయాను. అసలు శానిటరీ ప్యాడ్స్ అనేవి ఉంటాయని కూడా నాకు తెలియదు. టవల్స్‌నే మడతపెట్టి వాడాను. ఇది కేవలం ఒక్కసారే వస్తుందేమో అనుకున్నాను" అని ఆమె నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలసరి సెలవుల ప్రస్తావన ఇంకా రాలేదని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. "ఇండస్ట్రీలో మహిళలు ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ, నెలసరి సెలవులు లేకుండా పనిచేయడమే వారికి సాధారణమైపోయింది. ఇది విచారకరం" అని ఆమె అన్నారు. తాను నెలసరి నొప్పిని తట్టుకోవడానికి హాట్ ప్యాడ్స్ వాడతానని, జీలకర్ర నీళ్లు తాగుతానని కూడా రష్మిక తెలిపారు.
Advertisement
Rashmika MandannaVijay DeverakondaRashmika Mandanna InterviewMenstrual Health AwarenessPeriod Leave in CinemaRashmika Vijay Relationship

More Telugu News

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11
..more