శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
Advertisement
- హై-ఎనర్జీ రెట్రో మాస్ సాంగ్ చిత్రీకరణ ప్రారంభం
- 2027 సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమా విడుదల
- శ్రీనువైట్ల దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణం
- శర్వానంద్ సరసన మానస వారణాసి హీరోయిన్
Advertisement
యంగ్ హీరో శర్వానంద్, ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం 'జార్జ్ క్రిష్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ఒక కీలక అప్డేట్ను విడుదల చేసింది. సినిమాలో ఒక హై-ఎనర్జీ రెట్రో మాస్ సాంగ్ చిత్రీకరణను ప్రారంభించినట్లు నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ వెల్లడించింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ.. "రెట్రో వైబ్స్, మాస్ బీట్స్తో వినోదం అపరిమితంగా ఉండబోతోంది! 'జార్జ్ క్రిష్' చిత్రం కోసం హై-ఎనర్జీ రెట్రో మాస్ సాంగ్ షూటింగ్ సాగుతోంది. దర్శకుడు శ్రీనువైట్ల, శర్వానంద్ సంక్రాంతికి ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు" అని పేర్కొన్నారు.
ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు. గతంలో శర్వానంద్ నటించిన 'శతమానం భవతి', 'ఎక్స్ప్రెస్ రాజా' వంటి చిత్రాలు సంక్రాంతికి విడుదలై ఘనవిజయాలు సాధించిన నేపథ్యంలో, 'జార్జ్ క్రిష్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో శర్వానంద్ సరసన మానస వారణాసి కథానాయికగా నటిస్తోంది. ఆమె పాత్రకు సినిమాలో ఎంతో ప్రాధాన్యం ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర సమర్పణలో రాంబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తుండగా, కేవీ గుహన్ ఛాయాగ్రాహకుడిగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.