'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13 | National
Advertisement
  • నవంబర్ 1న ఢిల్లీలో 'ఇండియా' కూటమి ర్యాలీ
  • వాయిదా వేయాలని వ్యాపారుల విజ్ఞప్తి
  • దీపావళి సీజన్‌లో రూ.10,000 కోట్ల వ్యాపారం నష్టపోతామని వర్తక సంఘం ఆందోళన
  • రామ్‌లీలా మైదానం పరిసరాల్లోని 20 మార్కెట్లపై ర్యాలీ ప్రభావం చూపుతుందని వెల్లడి
  • గత నెలలో జరిగిన ర్యాలీల వల్ల రూ. 3,000 కోట్లు నష్టపోయామని ఆవేదన
  • నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ, పండగ తర్వాత ర్యాలీ నిర్వహించాలని కోరిక
Advertisement
ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నవంబర్ 1న 'ఇండియా' కూటమి నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీని వాయిదా వేయాలని వ్యాపార వర్గాలు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కోరాయి. దీపావళి పండగ సీజన్‌లో ఈ ర్యాలీ నిర్వహిస్తే సుమారు రూ.10,000 కోట్ల మేర వ్యాపార నష్టం వాటిల్లుతుందని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సీటీఐ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ లేఖ రాశారు.

పండగ సీజన్‌‌ను దృష్ట్యాలో ఉంచుకుని నవంబర్ 10 తర్వాత ర్యాలీని నిర్వహించాలని ఆయన ఆ లేఖలో సూచించారు. నవంబర్ 6న ధంతేరస్, నవంబర్ 8న దీపావళి ఉన్న నేపథ్యంలో కొనుగోళ్ల కోసం ప్రజలు భారీగా మార్కెట్లకు వస్తారని, ఈ సమయంలో ర్యాలీ నిర్వహిస్తే వాణిజ్య కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. దీపావళి పండగ వేళ ఢిల్లీ వ్యాప్తంగా బంగారం, వెండి, ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, గృహోపకరణాలు, డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, వాహనాలు, స్థిరాస్తి, గిఫ్ట్ ఆర్టికల్స్ వంటి అన్ని రంగాల్లో కలిపి సుమారు రూ.25,000 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని సీటీఐ అంచనా వేసింది.

రామ్‌లీలా మైదానానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోనే చాందినీ చౌక్, సదర్ బజార్ వంటి సుమారు 20 హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లు ఉన్నాయని, ర్యాలీ కారణంగా విధించే ట్రాఫిక్ ఆంక్షలతో ఈ ప్రాంతమంతా స్తంభించిపోయే ప్రమాదం ఉందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత అక్టోబర్ మాసంలో సెంట్రల్ ఢిల్లీలో జరిగిన పలు ర్యాలీలు, రహదారుల మూసివేత వల్ల ఇప్పటికే వ్యాపారులు రూ.3,000 కోట్ల వరకు నష్టపోయారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఓటర్ల జాబితా సవరణలో "ఓట్ల చోరీ" జరిగిందన్న ఆరోపణలతో, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 'ఇండియా' కూటమి ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అయితే, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును తాము గౌరవిస్తామని, పండగ సీజన్ ముగిసే వరకు వాణిజ్య ప్రాంతాలకు దూరంగా ర్యాలీలు నిర్వహించాలని సీటీఐ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది.
Advertisement
Rahul GandhiINDIA alliance rallyDelhi traders protestRamlila Maidan protestDiwali business loss DelhiCTI letter to Rahul Gandhi

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more