'సీడెడ్', 'నైజాం' వద్దు.. 'రాయలసీమ', 'తెలంగాణ' అనండి: దర్శకుడు రాహుల్ సాంకృత్యన్
Advertisement
- 'రణబాలి' సక్సెస్ మీట్‌లో రాహుల్ సాంకృత్యన్ కీలక వ్యాఖ్యలు
- తమ సినిమాపై కుట్రపూరితంగా నెగెటివ్ ప్రచారం చేశారని ఆవేదన
- మంచి సినిమాను ఎవరూ ఆపలేరని ప్రేక్షకులు నిరూపించారని వ్యాఖ్య
Advertisement
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన 'రణబాలి' చిత్రంపై కొంతమంది ఉద్దేశపూర్వకంగా నెగెటివ్ ప్రచారం చేశారని ఆ చిత్ర దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఆరోపించారు. అనంతపురంలో నిర్వహించిన 'రణబాలి రణభేరి' విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కొందరు రివ్యూయర్లు సినిమాను నెగెటివ్‌గా చూపించే ప్రయత్నం చేసినప్పటికీ... మంచి సినిమాను ఎవరూ ఆపలేరని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారని అన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ తన అనంతపురం అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. "నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఇక్కడి థియేటర్లలోనే 'ఇంద్ర', 'నరసింహ నాయుడు' వంటి చిత్రాలు చూశాను. ఇప్పుడు అవే థియేటర్లలో నా సినిమా హౌస్‌ఫుల్ బోర్డులతో నడుస్తుండటం చాలా గర్వంగా ఉంది" అని ఆయన భావోద్వేగంగా చెప్పారు. మంచి సినిమా ఇస్తే రాయలసీమ ప్రజలు ఎప్పుడూ ముందుండి ఆదరిస్తారని కొనియాడారు.
అలాగే, చిత్ర పరిశ్రమ వర్గాలు, మీడియాకు ఆయన ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. "మనం ఇప్పటికీ ట్రేడ్‌లో 'సీడెడ్', 'నైజాం' అని పిలుస్తున్నాం. దయచేసి ఆ పదాలు వాడకండి. అవి బానిసత్వాన్ని, బూర్జువా వ్యవస్థను గుర్తుచేస్తాయి. వాటికి బదులుగా 'రాయలసీమ', 'తెలంగాణ' అనే అందమైన తెలుగు పదాలనే వాడుదాం" అని రాహుల్ సాంకృత్యన్ కోరారు. పీరియాడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.