Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసు.. ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు

Tiger Shroff firing case RGV interesting comments
Advertisement
  • షూటర్లు చూడ్డానికి టీ బాయ్స్‌గా కూడా పనికిరారని వ్యాఖ్య
  • నిజజీవిత నేరగాళ్లకు, సినిమా విలన్లకు తేడాను వివరించిన వర్మ
  • రియల్ లైఫ్ కాస్టింగ్ డైరెక్టర్ విచిత్రంగా ఉంటారంటూ పోస్ట్
Advertisement
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో మరోసారి స్పందించాడు. బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల కేసులో పట్టుబడిన నిందితుల రూపురేఖలను ఉద్దేశించి ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆ షూటర్లు చూడ్డానికి ఎంత సాధారణంగా ఉన్నారంటే, సినిమాల్లో విలన్ల అడ్డాలో టీ అందించే కుర్రాళ్ల పాత్రలకు కూడా వారిని ఎంపిక చేయరంటూ వర్మ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.

నిజజీవితంలోని నేరగాళ్లకు, వెండితెరపై కనిపించే గ్లామరస్ విలన్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని వర్మ తన 'ఎక్స్' ఖాతాలో పేర్కొన్నాడు. "మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంపై సినిమా తీసినా, నిజంగా దావూద్‌లా కనిపించే వ్యక్తిని ఆ పాత్రకు ఎంపిక చేయకపోవచ్చు" అని ఆయన ఉదాహరణగా పేర్కొన్నాడు. ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ ఛాబ్రాను ట్యాగ్ చేస్తూ.. "రీల్ లైఫ్ కాస్టింగ్ డైరెక్టర్‌తో పోలిస్తే రియల్ లైఫ్ కాస్టింగ్ డైరెక్టర్ అభిరుచి చాలా విచిత్రంగా ఉంటుంది" అని తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

అక్టోబర్ 19న ముంబైలోని జుహు ప్రాంతంలోని ఫుట్‌బాల్ క్లబ్ సమీపంలో టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో టైగర్ సురక్షితంగా బయటపడగా, అతడి డ్రైవర్ తో పాటు ఒక ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు రాజస్థాన్‌లోని కోటాలో అరెస్ట్ చేశారు. గతంలోనూ ఈ ఘటనపై స్పందించిన వర్మ.. ఈ దాడి వెనుక డబ్బు, సుపారీ లేదా పాత కక్షల కన్నా "గర్వం, అహం" ప్రధాన కారణమై ఉండొచ్చని విశ్లేషించడం గమనార్హం. 
Advertisement
Advertisement
Tiger Shroff
Ram Gopal Varma
Tiger Shroff firing case
Mumbai Police
Mukesh Chhabra
Bollywood news

More Telugu News