Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్రాభివృద్ధికి జగనే అడ్డంకి: ప్రభుత్వ విప్ బొండా ఉమ

Bonda Uma says Jagan Mohan Reddy is the main obstacle to state development
Advertisement
  • స్థానిక ఎన్నికలను ఆపేందుకు వైసీపీ 59 కేసులు వేసిందని ఆరోపణ
  • 2021లో దౌర్జన్యాలతో 24% ఏకగ్రీవాలు చేసుకున్నారని వ్యాఖ్య
  • కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తోందని స్పష్టీకరణ
  • 2024లోనే వైసీపీ పతనం మొదలైందని, స్థానిక ఎన్నికలతో భూస్థాపితం ఖాయమని జోస్యం
Advertisement
రాష్ట్ర అభివృద్ధిని, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే వైసీపీ అధినేత జగన్ ఏకైక అజెండా అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఓటమి భయంతోనే జగన్ 'క్రిమినల్ లిటిగెంట్‌'గా మారి, న్యాయస్థానాలను అడ్డుపెట్టుకుని ఎన్నికలను నిలిపివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలను ఆపేందుకు వైసీపీ 59 కేసులు వేసిందని ఆరోపించారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

స్థానిక సంస్థలకు 16వ ఆర్థిక సంఘం నుంచి అందాల్సిన సుమారు రూ. 12,500 కోట్ల నిధులను రాకుండా చేయడమే జగన్ కుట్ర అని బొండా ఉమ మండిపడ్డారు. "నేడు ఎన్నికలు జరిగితే వైసీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయం. అందుకే నామినేషన్ల ప్రక్రియ మొదలైన నాటి నుంచే దౌర్జన్యాలకు తెరలేపారు. పుంగనూరు, తిరుపతి, నగరి, రాయచోటి వంటి ప్రాంతాల్లో వాహనాలను తగలబెట్టడం, రాళ్లు, కర్రలతో దాడులు చేయడం వంటి అరాచకాలకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా స్పష్టంగా ఉన్నాయి" అని ఆయన పేర్కొన్నారు.

2021 స్థానిక ఎన్నికల్లో వైసీపీ బెదిరింపులు, కిడ్నాపులు, హత్యాయత్నాలతో 24 శాతం స్థానాలను బలవంతంగా ఏకగ్రీవం చేసుకుందని బొండా ఉమ గుర్తుచేశారు. "పుంగనూరులో 85 స్థానాలకు గానూ 84, మాచర్లలో 77 స్థానాలకు గానూ 74 స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న నీచ చరిత్ర జగన్‌ది. 2014లో చంద్రబాబు హయాంలో కేవలం 1 శాతం మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. దొంగే దొంగ అన్నట్లుగా, తను చేసిన అరాచకాలను ఇతరులపై నెట్టే ప్రయత్నం జగన్ చేస్తున్నారు" అని విమర్శించారు.

సొంత బాబాయిని హత్య చేయించి, ‘నారాసుర రక్తచరిత్ర’ పేరిట దుష్ప్రచారం చేసిన వ్యక్తి జగన్ అని, గతంలో ఇచ్చిన హామీల్లో 85 శాతం అమలు చేయకుండా ఇప్పుడు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ 27 నెలల్లో రూ. 1,60,000 కోట్లను సంక్షేమానికి ఖర్చు చేస్తూ, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటోందని అన్నారు. స్థానిక ఎన్నికల్లో పరాజయం తప్పదనే భయంతోనే జగన్ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, 2024లోనే వైసీపీ పతనం ప్రారంభమైందని, స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగితే ఆ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని బొండా ఉమ జోస్యం చెప్పారు.
Advertisement
Advertisement
Bonda Uma
Jagan Mohan Reddy
Andhra Pradesh Local Body Elections
YSRCP
TDP
AP State Development

More Telugu News