Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కుక్క కరిచిన ఆవు మృతి.. పాలు తాగిన 450 మందికి టీకాలు.. పాలతో రేబిస్‌ సోకుతుందా?

Gorakhpur Cow Dies After Dog Bite 450 People Vaccinated After Drinking Milk
Advertisement
  • యూపీలో ఆవు మృతితో రేబిస్‌ కలకలం
  • చరణామృతం తాగిన సుమారు 450 మందికి టీకాలు
  • ఆవుకు రేబిస్‌ ఉన్నట్లు నిర్ధారణ కాలేదు 
  • ఆవు పాలు ఇళ్లకు, దుకాణాలకు సరఫరా అయినట్లు సమాచారం
  • పాల ద్వారా రేబిస్‌ వ్యాప్తికి లేని శాస్త్రీయ ఆధారాలు
Advertisement
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ జిల్లాలో ఓ ఆవు మృతితో రేబిస్‌ కలకలం రేగింది. ఆ ఆవు పాలతో తయారు చేసిన ప్రసాదం తాగిన రెండు గ్రామాలకు చెందిన సుమారు 450 మంది ముందు జాగ్రత్తగా రేబిస్‌ టీకాలు వేయించుకున్నారు. అయితే పాల ద్వారా రేబిస్‌ వ్యాపిస్తుందా? అనే సందేహాలు స్థానికుల్లో ఆందోళనకు కారణమయ్యాయి.

మీడియా కథనాల ప్రకారం.. ఆవు ఒకటి రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడింది. పరిస్థితి విషమించడంతో యజమాని ప్రైవేటు పశువైద్యులను సంప్రదించారు. వీధి కుక్క కరవడం వల్ల ఆవుకు రేబిస్‌ సోకి ఉండొచ్చని వారు అనుమానించినట్లు సమాచారం. అయితే ఆవుకు రేబిస్‌ ఉన్నట్లు నిర్ధారణ కాలేదు.

ఆ ఆవు పాలను స్థానికంగా చరణామృతం అనే ప్రసాదం తయారీకి ఉపయోగించడంతో పాటు కొన్ని దుకాణాలు, ఇళ్లకు కూడా సరఫరా చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆ పాలను వినియోగించినవారు ఆందోళనకు గురయ్యారు. స్థానిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు తీసుకోవడంతో ఆరోగ్య శాఖ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది.

పాలతో రేబిస్‌ వస్తుందా?
రేబిస్‌ అనేది ప్రాణాంతక వైరస్‌ వ్యాధి. సాధారణంగా రేబిస్‌ సోకిన జంతువు కరవడం ద్వారా ఇది మనుషులకు వ్యాపిస్తుంది. ఆ జంతువు లాలాజలం గాయాలపై పడినా, కళ్లు, ముక్కు, నోటి వంటి శ్లేష్మ పొరలకు తగిలినా ఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉంటుంది.

అయితే రేబిస్‌ సోకిన జంతువు పాలు తాగడం వల్ల మనుషులకు ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారించే శాస్త్రీయ ఆధారాలు లేవని ‘జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం’ (ఎన్‌సీడీసీ) పేర్కొంది. పాలు, పాల ఉత్పత్తుల వినియోగం ద్వారా రేబిస్‌ వ్యాపించినట్లు ప్రయోగశాల లేదా వ్యాధి పరిశీలన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అందువల్ల అలాంటి పాలను తాగినంత మాత్రాన రేబిస్‌ నివారణ టీకాలు అవసరమని చెప్పలేమని తెలిపింది.

అయితే అనుమానిత జంతువు పాలు లేదా పాల ఉత్పత్తులను వినియోగించకుండా ఉండటమే మంచిది. జంతువు కరిచినా, లాలాజలం గాయానికి లేదా కళ్లకు, నోటికి తగిలినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. రేబిస్‌ లక్షణాలు కనిపించే వరకు వేచి ఉండకూడదు.
Advertisement
Advertisement
Gorakhpur Cow
Rabies Outbreak
Rabies Vaccine
Milk Safety
National Centre for Disease Control
Stray Dog Bite

More Telugu News