Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం.. టీపీసీసీ చీఫ్

Mahesh Kumar Goud Alleges Secret Deal Between BJP and BRS
Advertisement
  • బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనన్న మహేశ్ గౌడ్
  • వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని వ్యాఖ్య
  • ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపణ
  • పార్లమెంట్‌లో ప్రతి బిల్లుకు బీఆర్ఎస్ మద్దతిచ్చిందని విమర్శ
  • కాళేశ్వరంపై కిషన్ రెడ్డి సీబీఐ విచారణ హామీ ఏమైందన్న మహేశ్ గౌడ్
Advertisement
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఒక్కటేనని, వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గురువారం నిజామాబాద్ అర్బన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని మహేశ్ గౌడ్ విమర్శించారు. త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు బీఆర్ఎస్ ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ముందుగా బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించిన తర్వాత, బీఆర్ఎస్ కేవలం నామమాత్రంగా అభ్యర్థులను బరిలోకి దింపుతుందన్నారు.

పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని, బీజేపీతో ఆ పార్టీకి ఉన్న సన్నిహిత సంబంధాలకు ఇదే నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపిస్తామని గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటన ఏమైందని మహేశ్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా నిలదీశారు.
Advertisement
Advertisement
Mahesh Kumar Goud
TPCC Chief
BJP BRS Secret Deal
Telangana Politics
Kaleshwaram Project Corruption
Telangana MLC Elections

More Telugu News