Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హర్మూజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి.. 21 మంది భారతీయుల సురక్షితం

Attack on oil tanker in Strait of Hormuz 21 Indians safe
Advertisement
  • హర్మూజ్ జలసంధిలో కువైట్ ఆయిల్ ట్యాంకర్‌పై దాడి
  • ఇటీవల కాలంలో ఇది రెండో దాడిగా గుర్తింపు
  • నౌకపై దాడితో చెలరేగిన మంటలను ఆర్పివేసిన సిబ్బంది
Advertisement
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో మరో వాణిజ్య నౌకపై దాడి జరిగింది. 21 మంది భారతీయ సిబ్బందితో కువైట్ జెండాతో ప్రయాణిస్తున్న 'ఎం/టీ అల్ దస్మా' ఆయిల్ ట్యాంకర్‌ను బుధవారం గుర్తుతెలియని ప్రొజెక్టైల్ ఢీకొట్టింది. ఈ ఘటనలో సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ వెల్లడించారు.

"అక్టోబర్ 21న హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న కువైట్ ఆయిల్ ట్యాంకర్ 'అల్ దస్మా'పై ప్రొజెక్టైల్ దాడి జరిగింది. నౌకలోని 21 మంది భారత సిబ్బందితో పాటు మిగతా వారంతా క్షేమంగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితిని మేము నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. సిబ్బంది భద్రతకు సంబంధించి షిప్ మేనేజ్‌మెంట్ కంపెనీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం" అని సోనోవాల్ 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.

ఒమన్‌లోని బుఖాకు పశ్చిమంగా 11 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ గుర్తించింది. ప్రొజెక్టైల్ ఢీకొన్న వెంటనే నౌకలో మంటలు చెలరేగగా, అప్రమత్తమైన సిబ్బంది వాటిని తక్షణమే అదుపులోకి తీసుకొచ్చారు.

ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అక్టోబర్ 16న కూడా 15 మంది భారత సిబ్బందితో ప్రయాణిస్తున్న 'ఎంటీ ఎస్‌టీ 3' అనే మరో క్రూడ్ ఆయిల్ ట్యాంకర్‌పై ఇదే తరహా దాడి జరిగింది. ఆ ఘటనలోనూ భారతీయులంతా సురక్షితంగా బయటపడ్డారు. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి భద్రత కల్పించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా భారత్ మరోసారి ఉద్ఘాటించింది.
Advertisement
Advertisement
Al Dasma
Strait of Hormuz
Indian crew safe
Sarbananda Sonowal
Kuwait oil tanker attack
Middle East maritime security

More Telugu News