Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దసరా శుభాకాంక్షలు

Chief Minister Chandrababu Dussehra greetings to the people of the state
Advertisement
  • రేపు విజయదశమి
  • చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా
  • ఈ పండుగ గొప్ప స్ఫూర్తిని ఇస్తుందన్న సీఎం చంద్రబాబు
  • తమ ప్రభుత్వం చేస్తున్న సంకల్పానికి జగన్మాత అనుగ్రహం లభించాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడి
Advertisement
రేపు (అక్టోబరు 20) విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ గొప్ప స్ఫూర్తిని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పండుగ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఈ మేరకు చంద్రబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. రైతన్నల శ్రమకు తగిన ఫలితం, మహిళలకు సాధికారత, యువతకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న సంకల్పానికి జగన్మాత అనుగ్రహం లభించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

"ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూ, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి. ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.
Advertisement
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh CM
Dussehra Greetings
Vijayadashami 2024
AP Government News
Kanaka Durga Temple

More Telugu News