టైగర్ ష్రాఫ్‌పై హత్యాయత్నం.. రాజస్థాన్‌లో ముగ్గురు షూటర్ల అరెస్ట్
Advertisement
- రాజస్థాన్‌లోని కోట రైల్వే స్టేషన్‌లో నిందితులను పట్టుకున్న పోలీసులు
- పట్టుబడ్డ వారికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు
- టైగర్ ష్రాఫ్ కదలికలపై రెక్కీ నిర్వహించి దాడికి ప్లాన్
Advertisement
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో ముగ్గురు షూటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. రైలులో ప్రయాణిస్తుండగా రాజస్థాన్‌లోని కోట రైల్వే స్టేషన్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితులకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు హర్యానాకు చెందినవారు కాగా, మరొకరు మహారాష్ట్ర వాసి.
ఏఎన్ఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఈ దాడి కోసం నిందితులు పక్కాగా ప్రణాళిక రచించినట్లు దర్యాప్తు ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. టైగర్ ష్రాఫ్ దినచర్య, కదలికలపై కొన్ని రోజుల పాటు నిఘా పెట్టి రెక్కీ నిర్వహించారు. ప్రతి ఆదివారం ఆయన ముంబైలోని జుహు ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు వస్తారన్న సమాచారంతో అక్కడి నుంచి కారులో తిరిగి వెళ్లేటప్పుడు దాడికి కుట్ర పన్నారు.
దాడి అనంతరం ఎస్వీ రోడ్ మీదుగా వైల్ పార్లే, అంధేరి మీదుగా పారిపోయేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అంధేరి వెస్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో మోటార్‌సైకిల్‌ను వదిలేసి, అక్కడి నుంచి బోరివలీకి రైలులో వెళ్లారు. ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మహారాష్ట్ర సరిహద్దు దాటి గుజరాత్‌లోకి ప్రవేశించినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా వెల్లడైంది. అయితే, చివరకు వీరు రాజస్థాన్‌లో పోలీసులకు చిక్కారు.