రింకూ సింగ్ మళ్లీ మెరిశాడు.. రంజీల్లో వరుసగా రెండో సెంచరీ.. సెలక్టర్లకు గట్టి సమాధానం
Advertisement
- రంజీ ట్రోఫీలో అదరగొడుతున్న రింకూ సింగ్
- గోవాపై అజేయ సెంచరీతో ఒంటరి పోరాటం
- ఈ సీజన్లో ఇది అతనికి వరుసగా రెండో శతకం
- జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం
- కష్టాల్లో ఉన్న ఉత్తరప్రదేశ్ జట్టును ఆదుకున్న రింకూ
Advertisement
టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న యువ సంచలనం రింకూ సింగ్, తన ప్రదర్శనతో బీసీసీఐ సెలక్టర్ల తలుపును గట్టిగా తడుతున్నాడు. జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ 2026-27 సీజన్లో వరుసగా రెండో సెంచరీ బాది, తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒంటరి పోరాటం చేసి అద్భుత శతకంతో జట్టును ఆదుకున్నాడు.
నిన్న కాన్పూర్‌లో గోవాతో ప్రారంభమైన రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-ఏ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఉత్తరప్రదేశ్, కేవలం 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్లు అభిషేక్ గోస్వామి (5), ఆర్యన్ జుయల్ (14), కెప్టెన్ కరణ్ శర్మ (0) ఘోరంగా విఫలమయ్యారు. ఈ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్, అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించాడు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా, మరోవైపు పట్టుదలగా నిలబడి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. తన సహజ శైలికి భిన్నంగా ఓపికగా ఆడి, జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. తన అజేయ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 118 పరుగులు సాధించాడు. అతని పోరాటంతో ఉత్తరప్రదేశ్ జట్టు 71 ఓవర్లలో 202 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఈ సీజన్లో బిహార్‌పై కూడా రింకూ (112) శతకం సాధించడం గమనార్హం.
ఇటీవలే జింబాబ్వే సిరీస్ తర్వాత రింకూను జాతీయ జట్టు నుంచి తప్పించారు. ఆపై న్యూజిలాండ్ పర్యటనకు కూడా ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో, అతను దేశవాళీ టోర్నీలో వరుస సెంచరీలతో చెలరేగడంతో, సోషల్ మీడియాలో అభిమానులు సెలక్టర్ల తీరును ప్రశ్నిస్తున్నారు. ఇంత నిలకడగా ఆడుతున్న ఆటగాడిని ఎందుకు విస్మరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. గోవా బౌలర్లలో లెగ్ స్పిన్నర్ యశ్ కస్వంకర్ 86 పరుగులిచ్చి 5 వికెట్లతో ఉత్తరప్రదేశ్ పతనాన్ని శాసించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన గోవా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శివేంద్ర భుజ్‌బల్ (31 నాటౌట్), సుయాష్ ప్రభుదేశాయ్ (12 నాటౌట్) ఉన్నారు. గోవా ఇంకా 159 పరుగులు వెనుకబడి ఉంది.