Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కంటిలో పన్ను.. వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. విస్తుపోయిన డాక్టర్లు!

Tooth in eye rare incident in medical history doctors stunned
Advertisement
  • భారత్‌లో 16 ఏళ్ల బాలుడి కంటి గుంతలో పన్ను గుర్తింపు
  • కంటిపైన వాపు రావడంతో పరీక్షించగా అసలు విషయం వెల్లడి
  • ఇలాంటి కేసు ప్రపంచంలోనే ఇదే మొదటిసారన్న‌ వైద్య నిపుణులు
  • ఈ సమస్యను 'ఎక్టోపిక్ టూత్' అంటార‌ని వెల్ల‌డి
  • శస్త్రచికిత్స ద్వారా పన్నును విజయవంతంగా తొలగించిన వైద్యులు
Advertisement
వైద్య శాస్త్రానికే సవాలు విసిరే అరుదైన ఘటన భారత్‌లో వెలుగుచూసింది. ఓ 16 ఏళ్ల బాలుడి కంటి గుంతలో పూర్తిగా పెరిగిన పన్నును గుర్తించి వైద్యులు నివ్వెరపోయారు. 'న్యూయార్క్ పోస్ట్' కథనం ప్రకారం.. ఈ బాలుడు తన ఎడమ కంటి పైభాగంలో నొప్పిలేని వాపుతో ఆసుపత్రికి వెళ్లాడు. 

మొదట సాధారణ గడ్డగా భావించినా, కొన్ని రోజుల్లోనే కనురెప్ప, కనుబొమ మధ్య చర్మం నుంచి రెండు గట్టి, తెల్లటి మొనలు బయటకు రావడం మొదలైంది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అనుమానంతో వైద్యులు అతనికి సీటీ స్కాన్‌తో పాటు ఇతర పరీక్షలు నిర్వహించారు. స్కానింగ్ రిపోర్టులు చూసి వారు నిర్ఘాంతపోయారు. బాలుడి కంటి పైభాగంలోని గుంతలో ఒక పన్ను పూర్తిగా పెరిగినట్లు నిర్ధారించారు. ఈ అరుదైన కేసుకు సంబంధించిన వివరాలను అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ జర్నల్‌లో ప్రచురించారు.

'ఎక్టోపిక్ టూత్' అంటే ఏమిటి?
నోటిలో కాకుండా శరీరంలోని ఇతర భాగాల్లో పన్ను పెరగడాన్ని వైద్య పరిభాషలో 'ఎక్టోపిక్ టూత్' అని పిలుస్తారు. కొన్నిసార్లు అంగిలిలో, ముక్కు లోపలి భాగంలో ఇలాంటి పళ్లు పెరగడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ, కంటి గుంతలో పన్ను పెరగడం మాత్రం వైద్య చరిత్రలో ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు. 

ఈ కేసు అధ్యయన సహ రచయిత డాక్టర్ మేఘనా తన్వర్ మాట్లాడుతూ.. "కంటి పైభాగంలోని సుపీరియర్ ఆర్బిట్‌లో ఎక్టోపిక్ టూత్ కేసు నమోదవడం ప్రపంచంలోనే ఇది మొదటిది, ఏకైక కేసు" అని వివరించారు.

సాధారణంగా జన్యుపరమైన సమస్యలు లేదా ముఖానికి తీవ్ర గాయాలు తగిలినప్పుడు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ బాలుడి విషయంలో అలాంటి చరిత్ర ఏదీ లేదని వైద్యులు తెలిపారు. అతని పుర్రెలో మరెక్కడా అదనపు దంతాలు లేవని, కేవలం యాదృచ్ఛికంగానే ఈ ఒక్క పన్ను తప్పుడు ప్రదేశంలో ఏర్పడిందని తేల్చారు.

అనంతరం వైద్యులు అతనికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ఆ పన్నును తొలగించారు. దీంతో వాపు తగ్గడమే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా నివారించారు. ఈ కేసుపై డాక్టర్ తన్వర్ స్పందిస్తూ.. "ఇది మాకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే తొలిసారి. ఈ కేసును చూసి మేం చాలా ఆశ్చర్యపోయాం" అని వ్యాఖ్యానించారు.
Advertisement
Advertisement
Ectopic Tooth
Rare Medical Case India
Tooth in Eye Socket
Dr Meghna Tanwar
Orbital Ectopic Tooth
Medical History First Case

More Telugu News