అరంగేట్రంలోనే అద్భుతం.. ప్రపంచ రికార్డు సృష్టించిన నిక్కీ ప్రసాద్.. టీ20 చరిత్రలో మూడో ప్లేయర్!
- తొలి రెండు బంతులకు రెండు వికెట్లు తీసిన నిక్కీ ప్రసాద్
- ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా, ప్రపంచంలో మూడో ప్లేయర్‌గా రికార్డు
- జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో ఈ ఘనత సాధించిన యువ ఆల్‌రౌండర్
- భారత్ అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన నిక్కీ ప్రసాద్
భారత మహిళా క్రికెట్లో సరికొత్త సంచలనం నిక్కీ ప్రసాద్.. తన టీ20 అంతర్జాతీయ బౌలింగ్ కెరీర్‌ను ఒక అద్భుతంలా ప్రారంభించింది. వేసిన తొలి రెండు బంతులకు వరుసగా రెండు వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా (పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి), ప్రపంచంలో మూడో ప్లేయర్‌గా నిక్కీ చరిత్ర సృష్టించింది. రాయ్‌పూర్‌లో జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ఈ అరుదైన రికార్డుకు వేదికైంది.
ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్ 15వ ఓవర్లో కెప్టెన్ స్మృతి మంధాన బంతిని యువ ఆల్‌రౌండర్ నిక్కీ ప్రసాద్‌కు అందించింది. అంతర్జాతీయ కెరీర్లో తన తొలి బంతిని వేసిన నిక్కీ, జింబాబ్వే బ్యాటర్ చిపో ముగేరి-తిరిపానోను పెవిలియన్ పంపింది. వికెట్ కీపర్ రిచా ఘోష్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో భారత్‌కు వికెట్ దక్కింది. ఆనందంలో ఉండగానే, తన రెండో బంతికి మరో బ్యాటర్ న్యాయషా గ్వాన్జురాను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపింది. దీంతో వరుస బంతుల్లో రెండు వికెట్లతో నిక్కీ తన అరంగేట్రాన్ని చిరస్మరణీయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆమె రెండు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 7 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి, భారత బౌలర్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచింది.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే ఈ ఘనత సాధించారు. 2005లో ఆస్ట్రేలియాకు చెందిన మైఖేల్ కాస్ప్రోవిచ్, 2019లో యూఎస్ఏకు చెందిన అక్షతరావు ఈ రికార్డును అందుకున్నారు. ఇప్పుడు వారి సరసన నిక్కీ ప్రసాద్ చేరింది. గతంలో భారత్ తరఫున అజిత్ అగార్కర్, ప్రజ్ఞాన్ ఓజా, విరాట్ కోహ్లీ లాంటి వారు తమ తొలి బంతికే వికెట్ తీసినా, తొలి రెండు బంతులకు రెండు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిక్కీ నిలిచింది.
20 ఏళ్ల నిక్కీ ప్రసాద్, 2025లో భారత్‌కు అండర్-19 మహిళల ప్రపంచకప్‌ను అందించిన కెప్టెన్ కావడం విశేషం. రెండు రోజుల క్రితమే టీ20ల్లో అరంగేట్రం చేసిన ఆమె, తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో అజేయంగా 39 పరుగులు చేసినా బౌలింగ్ చేయలేదు. ఇక ఈ మ్యాచ్‌లో జింబాబ్వే నిర్దేశించిన 103 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 8.5 ఓవర్లలోనే ఛేదించి, 2-0 తేడాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకుంది.