ఇమ్రాన్ ఇంటర్వ్యూ వివాదం.. ఇద్దరు ఇంగ్లండ్ కామెంటేటర్లపై పాకిస్థాన్ వేటు!
- ట్రై సిరీస్ కామెంట్రీ ప్యానెల్ నుంచి నాసర్ హుస్సేన్, మైఖేల్ అథర్టన్‌ల తొలగింపు
- ఇమ్రాన్ ఖాన్ కుమారులతో అథర్టన్ చేసిన ఇంటర్వ్యూనే దీనికి కారణం
- జైల్లో ఇమ్రాన్‌ను ప్రభుత్వం చంపేందుకు చూస్తోందని కుమారులు ఆరోపణలు
- ఇంటర్వ్యూపై అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
- 2024 పర్యటనలో ఈ ఇద్దరు కామెంటేటర్లు ఉండటం గమనార్హం
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు, ప్రముఖ కామెంటేటర్లు నాసర్ హుస్సేన్, మైఖేల్ అథర్టన్‌లను కామెంట్రీ ప్యానెల్ నుంచి తొలగించింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్‌కు సంబంధించి ఆరుగురు సభ్యులతో ప్రకటించిన కామెంట్రీ బృందంలో వీరిద్దరి పేర్లు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. జైలులో ఉన్న పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కుమారులతో చేసిన ఓ వివాదాస్పద ఇంటర్వ్యూ ప్రసారం కావడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఈ ఏడాది పాకిస్థాన్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించినప్పుడు, స్కై స్పోర్ట్స్ ఛానెల్‌లో మైఖేల్ అథర్టన్.. ఇమ్రాన్ కుమారులైన సులేమాన్, కాసిమ్ ఖాన్‌లను ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో తమ తండ్రిని జైలులో నిర్లక్ష్యం చేస్తూ, ఏకాంతంగా ఉంచి, అధికారులు "బహిరంగంగానే చంపడానికి ప్రయత్నిస్తున్నారని" వారు సంచలన ఆరోపణలు చేశారు.
ఇమ్రాన్ రోజుకు 23 గంటలకు పైగా ఓ చిన్న గదిలో ఒంటరిగా గడుపుతున్నారని, తమకు 'సాంకేతిక కారణాలు' చూపి వీసాలు కూడా నిరాకరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఇంటర్వ్యూ లార్డ్స్ టెస్టు సమయంలో ప్రసారం కావడంతో పీసీబీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి నిరసనగా మధ్యాహ్నం సెషన్‌కు తమ ఆటగాళ్లను మైదానం నుంచి వాకౌట్ చేయిస్తామని బెదిరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
అంతేగాక పీసీబీ స్కై స్పోర్ట్స్‌కు అధికారికంగా ఫిర్యాదు కూడా చేసింది. పాకిస్థాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ పీటీవీ ఈ ఇంటర్వ్యూను దేశీయంగా ప్రసారం చేయలేదు. అయితే, ఈ ఆరోపణలను పాకిస్థాన్ ప్రభుత్వం ఖండించింది. ఇమ్రాన్‌ను కలిసేందుకు బంధువులు, న్యాయవాదులు, వైద్యులను అడ్డుకోలేదని స్పష్టం చేసింది.
2023 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తన కంటిచూపులో 75% కోల్పోయారని వార్తలు వస్తున్నాయి. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని పలువురు మాజీ క్రికెటర్లు ప్రభుత్వానికి లేఖలు రాశారు.
కాగా, 2024లో ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించినప్పుడు అథర్టన్, హుస్సేన్ ఇద్దరూ కామెంట్రీ బృందంలో ఉన్నారు. ఇప్పుడు వారిని తొలగించడం ఆనాటి వివాదానికి ప్రతీకార చర్యగానే భావిస్తున్నారు.