చెన్నైకి రెడ్ అలర్ట్.. తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు
- అతి భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైకి రెడ్ అలర్ట్ జారీ
- చెంగల్పట్టు, తిరువళ్లూరు సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో కుండపోత వానలు
- చెన్నై, శివారు ప్రాంతాల్లో అనేక కాలనీలు జలమయం
తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని చెన్నైలో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో నగరవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెన్నైతో పాటు చెంగల్పట్టు, తిరువళ్లూరు, నీలగిరి, కోయంబత్తూరు, తేని జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' ప్రకటించారు. మరో 26 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
శనివారం కురిసిన భారీ వర్షాలకు చెన్నై మహానగరంతో పాటు శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని నివాసగృహాల్లోకి వరద నీరు చేరగా, రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అధికార యంత్రాంగం స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, మోటార్ పంపుల సాయంతో వరద నీటిని తొలగించే పనులను వేగవంతం చేసింది. అక్టోబరు 15న ప్రారంభమైన ఈశాన్య రుతుపవనాల ప్రభావంతోనే ఈ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవుల ప్రకటనపై విద్యార్థులు, తల్లిదండ్రులలో సందిగ్ధత నెలకొంది. దీనిపై విద్యాశాఖ మంత్రి రాజ్మోహన్ స్పందిస్తూ.. వాతావరణ శాఖ నివేదికల ఆధారంగా పాఠశాలల సెలవులపై ఎప్పటికప్పుడు సమీక్షించి, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.