రాయచోటికి పంజాబ్, పుంగనూరుకు బెంగళూరు గ్యాంగులను తెచ్చారు: ధూళిపాళ్ల నరేంద్ర
- స్థానిక ఎన్నికల్లో వైసీపీనే ఉద్దేశపూర్వకంగా గొడవలు చేస్తోందన్న నరేంద్ర
- 2021లో చేసిన అరాచకాలకు ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారని వ్యాఖ్య
- ఎస్ఈసీని తిట్టి మళ్లీ ఆయన దగ్గరకే వెళ్లారని జగన్‌పై విమర్శలు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో వైసీపీ ఉద్దేశపూర్వకంగానే అలజడులు సృష్టిస్తోందని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్ ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో అరాచకాలు పెరిగిపోవడం వల్లే 2024 ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు.
రాయచోటికి పంజాబ్ గ్యాంగ్‌ను, పుంగనూరుకు బెంగళూరు గ్యాంగ్‌ను వైసీపీనే తీసుకొచ్చిందని నరేంద్ర ఆరోపించారు. పులివెందులలో ఎంపీ అవినాశ్ రెడ్డి 200 మందితో పోలింగ్ కేంద్రానికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. కేవలం ఐదు చోట్ల జరిగిన ఘటనలను రాష్ట్రవ్యాప్త అల్లర్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ తలుచుకుంటే వైసీపీ నామినేషన్లు కూడా వేయలేని పరిస్థితి ఉండేదని అన్నారు.
పుంగనూరు, పులివెందుల, రాయచోటిలో దశాబ్దాలుగా సాగిన అణచివేత కారణంగానే ఇప్పుడు ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా తిరగబడుతున్నారని ఆయన పేర్కొన్నారు. తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను దూషించిన జగన్, ఇప్పుడు మళ్లీ ఆయన దగ్గరకే వెళ్లారని ఎద్దేవా చేశారు. 2021 స్థానిక ఎన్నికల్లో వైసీపీ చేసిన అరాచకాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటోందని, కర్మ ఎవరినీ వదలదని జగన్ గ్రహించాలని హితవు పలికారు.