అప్పటి వరకు జగన్ కదలికలపై నిఘా పెట్టాలి: ఎంపీ సానా సతీశ్
- స్థానిక ఎన్నికలు ముగిసే వరకు జగన్పై నిఘా పెట్టాలన్న టీడీపీ ఎంపీ
- తాడేపల్లి ఆదేశాలతోనే రాయలసీమలో అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపణ
- టీడీపీ నేతలే లక్ష్యంగా కిరాయి రౌడీలతో దాడులు చేస్తున్నారని విమర్శ
- వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కదలికలపై స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు నిఘా ఉంచాలని టీడీపీ ఎంపీ సానా సతీశ్ డిమాండ్ చేశారు. తాడేపల్లి నుంచి వస్తున్న ఆదేశాలతోనే రాయలసీమలో వైసీపీ నేతలు అల్లర్లు సృష్టిస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
టీడీపీ నేతలే లక్ష్యంగా వైసీపీ నాయకులు కిరాయి రౌడీలను తీసుకొచ్చి దాడులకు పాల్పడుతున్నారని సానా సతీశ్ ఆరోపించారు. పుంగనూరులో కార్ల విధ్వంసం, పులివెందులలో కొనసాగుతున్న అశాంతికి జగన్ ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనల గురించి గవర్నర్కు వివరిస్తారా? అని నిలదీశారు.
అదేవిధంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని సతీష్ డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీల చర్యల వల్ల జాతీయ స్థాయిలో రాష్ట్ర పరువు, ప్రతిష్ఠలకు భంగం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.