పుంగనూరు మున్సిపల్ ఎన్నికలకు వైసీపీ దూరం.. పోటీ చేయడం లేదని పెద్దిరెడ్డి ప్రకటన
- నామినేషన్ల తొలిరోజే టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ
- తమను అడ్డుకున్నారంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆరోపణ
- మిథున్ రెడ్డిపై 4 పోలీసు కేసులు నమోదు
పుంగనూరు మున్సిపల్ ఎన్నికల బరి నుంచి వైసీపీ తప్పుకుంది. నామినేషన్ల దాఖలు తొలిరోజైన శుక్రవారం చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.
నామినేషన్లు వేయడానికి వెళ్తున్న తమ అభ్యర్థులను అధికార టీడీపీ గూండాలు అడ్డుకున్నారని, ఎంపీ మిథున్‌రెడ్డిపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని పెద్దిరెడ్డి ఆరోపించారు. అధికారులు సైతం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే పుంగనూరులో మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
అయితే, వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి వందలాది మందితో కాన్వాయ్‌గా రావడంతోనే ఘర్షణ చెలరేగిందని టీడీపీ నేతలు, పోలీసులు చెబుతున్నారు. మిథున్ రెడ్డిపై నాలుగు పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. అన్ని కేసుల్లోనూ ఆయనను ఏ-1గా పోలీసులు పేర్కొన్నారు.
ప్రస్తుతం పుంగనూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. పరిస్థితులు చేజారిపోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పలువురిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి.