విజయనగరంలో వేర్వేరుగా బరిలోకి టీడీపీ, జనసేన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయనగరంలో వేర్వేరుగా బరిలోకి టీడీపీ, జనసేన

TDP Jana Sena alliance rift in Vizianagaram as parties contest separately
  • విజయనగరంలో టీడీపీ-జనసేన నేతల్లో అసంతృప్తి
  • గెలుపు అవకాశాలు తక్కువ ఉన్న సీట్లు ఇచ్చారంటున్న జనసేన నాయకులు
  • విజయనగరం మేయర్ అభ్యర్థిగా జనసేన నేత భార్య స్వతంత్ర నామినేషన్
  • నెల్లిమర్లలో బీజేపీకి చైర్మన్ పదవిపై టీడీపీ, జనసేన కార్యకర్తల అసమ్మతి రాగం
విజయనగరం జిల్లాలో సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో జనసేన నాయకులు తిరుగుబాటు అభ్యర్థులుగా మారి స్వతంత్రంగా నామినేషన్లు దాఖలు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది.

విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్, నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపులపై జనసేన తీవ్ర అసంతృప్తితో ఉంది. గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న స్థానాలను తమకు కేటాయిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై శనివారం రాత్రి వరకు విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి రాజు, బొబ్బిలి ఎమ్మెల్యే అప్పల నాయుడు జనసేన నేతలతో చర్చలు జరిపినప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. సంప్రదింపులు విఫలం కావడంతో జనసేన నాయకులు స్వతంత్రంగా బరిలోకి దిగారు.

జనసేన నాయకుడు గూరన అయ్యాల సతీమణి గూరన రాధిక, విజయనగరం మేయర్ అభ్యర్థిగా స్వతంత్రంగా నామినేషన్ దాఖలు చేశారు. వీరితో పాటు మరో 12 డివిజన్లలో జనసేన నేతలు కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఇదే తరహా పరిస్థితి నెల్లిమర్ల నగర పంచాయతీలోనూ నెలకొంది. అక్కడ చైర్మన్ పదవిని మిత్రపక్షమైన బీజేపీకి కేటాయించడంపై టీడీపీ, జనసేన శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దీని ప్రభావంతో బీజేపీ అభ్యర్థులకు పోటీగా ఈ రెండు పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం.  
Advertisement
TDP Jana Sena Alliance
Vizianagaram local body elections
Aditi Gajapathi Raju
Jana Sena rebel candidates
Nellimarla Nagar Panchayat polls
Andhra Pradesh political news

More Telugu News