నూడుల్స్ తిన్న తర్వాత కుటుంబం మొత్తం మృతి.. ఫుడ్ పాయిజనా? విషప్రయోగమా?
- గ్రేటర్ నోయిడాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి
- నూడుల్స్ తిని, టీ తాగాక మరణించిన కుటుంబం
- విషప్రయోగం జరిగిందని అధికారుల అనుమానం
- ఆస్తి తగాదాల కోణంలోనూ కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు
- పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలతోనే తేలనున్న వాస్తవాలు
ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు అనుమానాస్పద రీతిలో మరణించారు. రబుపురా ప్రాంతంలోని నగ్లా శ్రీ పదమ్ గ్రామంలో శనివారం ఉదయం ఈ హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. ముందురోజు రాత్రి నూడుల్స్ తిని, టీ తాగాక నిద్రపోయిన వీరు, ఉదయం విగతజీవులుగా కనిపించారు. తొలుత ఆహారం కలుషితమైందని భావించినప్పటికీ, విషప్రయోగం జరిగి ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
మృతుల్లో భార్యాభర్తలు మహేశ్ (37), లలిత (35)తో పాటు వారి ముగ్గురు పిల్లలు లడ్డూ (11), మిష్టి (7), సాక్షత్ (3) ఉన్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో వీరంతా నూడుల్స్ తిని, టీ తాగిన తర్వాత నిద్రకు ఉపక్రమించారు. శనివారం ఉదయం పిల్లలు పాఠశాలకు వెళ్లాల్సి ఉండగా, ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు, ఇరుగుపొరుగు వారు తలుపులు తెరిచి చూడగా, ఐదుగురూ మంచాలపై విగతజీవులుగా పడి ఉన్నారు. వారి నోటి నుంచి నురగలు వస్తున్నట్లు కొందరు గమనించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు, ఆహార భద్రతా విభాగం అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఆహార నమూనాలను పరీక్ష నిమిత్తం ల్యాబ్కు పంపారు. ఆహార భద్రతా అధికారి ఓ.పి. సింగ్ మాట్లాడుతూ.. “తిన్న ఆహార ప్యాకెట్లలో గడువు ముగిసినవి ఏవీ లేవు. సాధారణంగా ఫుడ్ పాయిజన్ అయితే కనిపించే వాంతులు, విరేచనాల వంటి లక్షణాలు కూడా లేకపోవడంతో ఇది విషప్రయోగం కేసులా కనిపిస్తోంది” అని అనుమానం వ్యక్తం చేశారు.
మరోవైపు, పోలీసులు ఆస్తి తగాదాల కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. మహేశ్ తల్లికి, కుటుంబానికి మధ్య ఆస్తి విషయమై గొడవలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. జాతర నుంచి తిరిగి వచ్చిన మహేశ్ తల్లే వారికి నూడుల్స్ వండి పెట్టినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. పోలీసులు ఆత్మహత్య కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్ స్పందించి, ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించినట్లు తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇది హృదయవిదారక ఘటన అని, సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ పరీక్షల ఫలితాలు వస్తేనే మరణాలకు కచ్చితమైన కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు.