Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గెలిచే దమ్ములేకే జగన్ పాన్ ఇండియా రౌడీయిజం: ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

Julakanti Brahmananda Reddy slams Jagan Mohan Reddy over Pan India Rowdyism
Advertisement
  • ఓటమి భయంతోనే జగన్ పాన్ ఇండియా రౌడీయిజం చేస్తున్నారని విమర్శ
  • కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ నుంచి రౌడీలను దింపుతున్నారని వ్యాఖ్య
  • తామే దాడులు చేసి టీడీపీపై నెట్టేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని విమర్శ
  • వివేకా హత్య తరహాలోనే ఇప్పుడు కూడా నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం
  • పంజాబ్ రౌడీలను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారన్న ఎమ్మెల్యే
Advertisement
స్థానిక ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసే, వైసీపీ అధినేత జగన్ 'పాన్ ఇండియా రౌడీయిజం' చేస్తున్నారని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల నుంచి గూండాలను రప్పించి విధ్వంసం సృష్టించడం, ఆ నెపాన్ని ప్రత్యర్థులపైకి నెట్టడం వైసీపీకి పరిపాటిగా మారిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

"దారుణాలకు పాల్పడటం, వాటిని ఇతరులపైకి తోసేయడం గొడ్డలి పార్టీకి పుట్టుకతో వచ్చిన విద్య. గతంలో వివేకానందరెడ్డిని హత్య చేసి, ఆ నెపాన్ని చంద్రబాబుపై నెట్టి 'నారాసుర రక్తచరిత్ర' అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించిన వ్యూహాన్నే జగన్ రెడ్డి నేటికీ కొనసాగిస్తున్నారు" అని బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. పుంగనూరు ఎంపీ మిథున్ రెడ్డి.. కర్ణాటక, తమిళనాడు నుంచి రాడ్లు, కర్రలతో గూండాలను రప్పిస్తుండగా, రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పంజాబ్ నుంచి ఏకంగా తుపాకులతో రౌడీలను దింపుతున్నారని, ఇది పాన్ ఇండియా రౌడీయిజం కాక మరేమిటని ఆయన ప్రశ్నించారు.

" వారి కార్లను వారే ధ్వంసం చేసుకుని, మా కార్యకర్తలపై దాడులకు తెగబడుతూ, తిరిగి మేమే అరాచకాలకు పాల్పడుతున్నట్లు బుకాయించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని జగన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చొని కుట్రలు పన్నుతున్నారు. రక్తంతో తడిచిన చేతులు ఎవరివో ప్రజలందరికీ తెలుసు" అని బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. పంజాబ్ నుంచి వచ్చిన రౌడీలను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారని, కూటమి కార్యకర్తలు చేతులు ముడుచుకుని కూర్చోబోరని, చట్టపరంగా పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. నాటి రాజారెడ్డి నుంచి నేటి జగన్ రెడ్డి వరకు విధ్వంసాలు సృష్టించడమే వారి నైజమని, ఎన్నికల్లో బలం లేనప్పుడు భయపెట్టి గెలవాలనే వైఎస్ కుటుంబ విధానాన్ని ఇప్పుడు కూడా అమలు చేయాలని చూస్తే ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు.
Advertisement
Advertisement
Julakanti Brahmananda Reddy
Jagan Mohan Reddy
Pan India Rowdyism
YSRCP Violence
Andhra Pradesh Local Elections
Macherla MLA

More Telugu News