బెజవాడలో దసరా సందడి.. మహాలక్ష్మి అలంకారంలో కనకదుర్గ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బెజవాడలో దసరా సందడి.. మహాలక్ష్మి అలంకారంలో కనకదుర్గ

Dasara celebrations in Vijayawada Kanaka Durga in Mahalakshmi Alankaram
  • ఇంద్రకీలాద్రికి భారీగా తరలివస్తున్న భక్తులు
  • అమ్మవారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం
  • ఈ సాయంత్రం దుర్గమ్మను దర్శించుకోనున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శనివారం కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఇంద్రకీలాద్రి జనసంద్రమైంది.

తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తడంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం అమ్మవారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు సహా ఇతర కనీస సౌకర్యాలను కల్పిస్తున్నారు.

ఈ సాయంత్రం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఇంద్రకీలాద్రిని సందర్శించనున్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పున్నమి ఘాట్‌లో నిర్వహించనున్న ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ కార్యక్రమంలో ఆయన హాజరుకానున్నారు. దసరా ఉత్సవాల వేళ ఇంద్రకీలాద్రి పరిసరాల్లో ఆధ్యాత్మికతతో కూడిన పండుగ వాతావరణం సంతరించుకుంది.
Advertisement
Kanaka Durga Temple
Vijayawada Dasara Navratri
Indrakeeladri Temple
Mahalakshmi Alankaram
Mohan Yadav Vijayawada Visit
Vijayawada Utsav 2.0

More Telugu News