వివేకా హత్య కేసు: వైఎస్ భాస్కర్ రెడ్డికి ఈడీ నోటీసులు.. నేడు విచారణ
- మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ
- మంగళవారం హైదరాబాద్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశం
- ఇప్పటికే పలువురు నిందితులను ప్రశ్నించిన ఈడీ
- బుధవారం అవినాశ్ రెడ్డిని కూడా విచారించే అవకాశం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ఆర్థిక లావాదేవీల కోణాన్ని లోతుగా పరిశోధిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఏడో నిందితుడైన వైఎస్ భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. మంగళవారం హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆయనను ఆదేశించింది.
సీబీఐ దర్యాప్తు సమాచారం ఆధారంగా ఈడీ ఈ విచారణ చేపట్టింది. హత్యకు సంబంధించిన కుట్రలో భారీగా నగదు చేతులు మారిందనే ఆరోపణల నేపథ్యంలో, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా నిందితుల ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ఈ కేసులో ఇప్పటికే సహ నిందితులైన సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలను ఈడీ ప్రశ్నించింది. సోమవారం మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని కూడా విచారించింది. తాజాగా మంగళవారం భాస్కర్ రెడ్డిని, బుధవారం ఎంపీ అవినాశ్ రెడ్డిని ప్రశ్నించేందుకు ఈడీ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వరుస విచారణలతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతమైంది.