రైతులకు బేడీలా?: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్ రావు ఆగ్రహం

Telangana
Advertisement
  • జూరాల నీటి కోసం ఆందోళన చేసిన రైతులపై కేసులు నమోదు
  • ప్రభుత్వ చర్యపై తీవ్రంగా మండిపడ్డ మాజీ మంత్రి హరీశ్ రావు
  • ఇది ప్రజా పాలన కాదు, ప్రజా పీడన అంటూ విమర్శలు
  • రైతులపై కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్
  • లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక
పంటలు కాపాడుకునేందుకు జూరాల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయాలని ఆందోళన చేసిన రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఇది ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని, అత్యంత హేయమైన చర్య అని విమర్శించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ ఖాతా వేదికగా స్పందించారు.

“కళ్ల ముందే ఎండుతున్న పంటలకు నీరివ్వమని అడిగిన రైతులపై కేసులు పెట్టడం సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి పాలనలో రైతుల చేతులకు బేడీలు వేయడం, పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం పరిపాటిగా మారింది” అని హరీశ్ రావు విమర్శించారు. వారి చేతగానితనం వల్ల పంటలకు నీరందకపోతే, కడుపు మండి నిలదీసిన రైతులపై అక్రమ కేసులు బనాయిస్తారా? అని ప్రశ్నించారు. కృష్ణాలో నీటి ప్రవాహాలు ఉన్నప్పుడు నీటిని లిఫ్ట్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించి, ఇప్పుడు రైతులను శిక్షిస్తున్నారని ఆరోపించారు.

“ఇది ప్రజా పాలన కాదు. ప్రజా పీడన. తప్పు ప్రభుత్వం చేస్తే శిక్ష రైతులు అనుభవించాలా?” అని హరీశ్ రావు నిలదీశారు. రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Advertisement

సంబంధిత వార్తలు

Harish RaoBRS PartyJurala Project waterTelangana farmers protestCongress government TelanganaPolice cases on farmers

More Telugu News

అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు 258 స్థానాలు.. 1992 తర్వాత అతిపెద్ద విజయం

23 Nov, 07:18

ఒక్కడి పట్టుదల.. 8 ఏళ్ల నిరీక్షణ.. ఎట్టకేలకు ముంబై మెట్రోకు లైన్ క్లియర్

23 Nov, 07:15

రోజూ అన్నం పెట్టిన వృద్ధుడి అంతిమయాత్రలో వీధి కుక్క.. శ్మశానంలో మౌనంగా కూర్చున్న 'కాలు'

23 Nov, 07:01

జెప్టోకు తొలుత వచ్చినవి 31 ఆర్డర్లే.. మూతపడే పరిస్థితి నుంచి ఎలా ఎదిగిందో చెప్పిన సహ వ్యవస్థాపకుడు

23 Nov, 06:54

డెల్టా ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక లోపం... అమెరికాలో 3,500 విమానాలు ఆలస్యం

23 Nov, 06:50

2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్, కోహ్లీ!

23 Nov, 06:40

తిలక్ వర్మ అద్భుత సెంచరీ.. అయినా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఓటమి

23 Nov, 06:34

తీర్పులను విమర్శించండి.. రాజ్యాంగ వ్యవస్థలను కాదు: సీజేఐ సూర్యకాంత్

23 Nov, 06:20

చేవెళ్లలో దొంగతనం ఫిర్యాదు చేసిన మహిళ హత్య: 24 గంటల్లో నిందితుడి అరెస్ట్

23 Nov, 06:18

తెలంగాణలో ‘కోత’ల మోత.. ప్రతీ పదిలో ఆరు సిజేరియన్లే!

23 Nov, 00:57

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 90 సీట్లు గెలుచుకుంటుంది: సీఎం రేవంత్ రెడ్డి

22 Nov, 23:36

బిస్లెరీ వాటర్ లో ప్రమాదకర రసాయనాలు.. చర్యలకు సిద్ధమైన ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ

22 Nov, 22:57

నవంబర్ చివరి వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

22 Nov, 22:47

ఏలియన్స్ కోసం నాసా పంపిన గోల్డెన్ రికార్డ్‌లో తెలుగు పలకరింపు.. ఆసక్తికర వివరాలు ఇవిగో!

22 Nov, 22:40

కొణిదెల సురేఖ వద్ద రూ.5 వేలు అప్పు తీసుకున్న బన్నీ వాసు.. ఇప్పటికీ తీర్చలేదట!

22 Nov, 22:28
..More Telugu News