Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయ్‌కి భయపడుతున్నారా? రాహుల్ గాంధీని నిలదీసిన డీఎంకే

Rahul Gandhi questioned by DMK on whether he is afraid of Vijay
Advertisement
  • సీఈసీకి వ్యతిరేకంగా ఢిల్లీలో విపక్షాల నిరసన
  • రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించిన డీఎంకే
  • తమిళనాడు ఓటర్ల జాబితాపై వైఖరి చెప్పాలని డిమాండ్
  • నటుడు విజయ్‌కి భయపడుతున్నారా అని ఘాటు విమర్శలు
Advertisement
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా విపక్షాలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్న వేళ, ఆయనకు ఊహించని రాజకీయ సెగ తగిలింది. ఒకప్పటి మిత్రపక్షమైన తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీ, రాహుల్‌ గాంధీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించింది.

డీఎంకే నేత శరవణన్ అన్నదురై సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు. "తమిళనాడులో ఎస్ఐఆర్ ద్వారా ఓటర్ల తొలగింపుపై రాహుల్ గాంధీ వైఖరి ఏమిటి? 'సర్' అనంతరం ఎన్నికైన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయాలన్న మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను ఆయన ఎందుకు సమర్థించడం లేదు? తమిళనాడులో 'సర్' గురించి మాట్లాడటానికి విజయ్‌కి భయపడుతున్నారా? ఇది ఎంతటి ద్వంద్వ నీతి" అని తన పోస్టులో ఘాటుగా విమర్శించారు.

ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ, డీఎంకేతో పొత్తును తెంచుకోవడం తెలిసిందే. ఈ పరిణామంతో తీవ్ర అసంతృప్తికి లోనైన డీఎంకే, ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి నుంచి కూడా వైదొలగింది. సీఈసీకి వ్యతిరేకంగా సాగే పోరాటానికి తమ మద్దతు ఉంటుందని చెబుతూనే, తాజాగా రాహుల్‌ గాంధీని లక్ష్యంగా చేసుకోవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
Advertisement
Advertisement
Rahul Gandhi
DMK
Vijay
Saravanan Annadurai
Tamil Nadu Politics
Voter List Revision

More Telugu News