Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐసీసీ చైర్మన్ జై షాతో నారా లోకేశ్ భేటీ.. ఏపీ స్పోర్ట్స్ హబ్‌పై చర్చ

Nara Lokesh meets ICC Chairman Jay Shah to discuss AP Sports Hub
Advertisement
  • ఏపీని ప్రధాన స్పోర్ట్స్ హబ్‌గా మార్చాలన్న లక్ష్యంపై చర్చ
  • రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో క్రికెట్‌ను ప్రోత్సహించే ప్రణాళిక
  • విశాఖలో వాటర్ స్పోర్ట్స్, మహిళల క్రికెట్‌కు ప్రాధాన్యం
  • రాష్ట్రవ్యాప్తంగా ఇండోర్ క్రికెట్ అకాడమీల ఏర్పాటుపై దృష్టి
Advertisement
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ జై షాతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను ఒక ప్రధాన క్రీడా కేంద్రంగా (స్పోర్ట్స్ హబ్) తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రణాళికలను ఈ సందర్భంగా జై షాకు వివరించారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను లోకేశ్ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా వెల్లడించారు.

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై తాము చర్చించినట్లు లోకేశ్ తెలిపారు. విశాఖపట్నాన్ని వాటర్ స్పోర్ట్స్ డెస్టినేషన్‌గా అభివృద్ధి చేయడం, రాష్ట్రంలో దేశీయ, మహిళా క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించడం, అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను ప్రోత్సహించడం వంటి విషయాలను జై షా దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇండోర్ క్రికెట్ అకాడమీల నిర్మాణంపైనా ప్రత్యేకంగా చర్చించినట్లు చెప్పారు.

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ క్రికెట్ పోటీలను విస్తరించాలని, ముఖ్యంగా బాలికలతో పాటు యువ క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు సృష్టించాలన్న తమ ప్రణాళికలను జై షాతో పంచుకున్నట్లు లోకేశ్ వివరించారు. ఈ సమావేశం ఎంతో సంతోషాన్నిచ్చిందని, తన మిత్రుడైన జై షా అందించిన ఆతిథ్యం, అద్భుతమైన గుజరాతీ సంప్రదాయ భోజనం మరువలేనివని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
Advertisement
Advertisement
Nara Lokesh
Jay Shah
ICC Chairman
Andhra Pradesh Sports Hub
Visakhapatnam Water Sports
Cricket Development

More Telugu News