లంకపై మనదే పైచేయి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లంకపై మనదే పైచేయి

చాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీస్ లో భారత్, శ్రీలంక తలపడుతున్న సంగతి తెలిసిందే. కాగా, గణాంకాలను పరిశీలిస్తే భారత్ కే విజయావకాశాలు ఎక్కువని గత రికార్డులు చెబుతున్నాయి. 2008 నుంచి ఇప్పటివరకు లంకేయులతో 40 వన్డేలాడిన టీమిండియాను 24 పర్యాయాలు విజయలక్ష్మి వరించింది. 14 మ్యాచ్ లలో లంక గెలవగా, ఓ పోరు టైగా ముగిసింది. మరో వన్డే ఫలితం తేలకుండానే రద్దయింది. కార్డిఫ్ లో శనివారం ఈ రెండు జట్లు చావోరేవో తేల్చుకోనుండగా.. అభిమానులు మాత్రం ధోనీ సేన విజయంపై గట్టి నమ్మకం పెట్టుకున్నారు.

More Telugu News