మనల్ని వ్యతిరేకించేవాళ్ళు మనకొద్దు: అద్వానీతో మోడీ
ఒకరిది దూకుడు మంత్రం.. మరొకరిది అనుభవ తంత్రం. ఒకే పార్టీ అయినా, వైఖరులు వేరే. వారిద్దరూ బీజేపీ అగ్రనేతలు మోడీ, అద్వానీ అని వేరే చెప్పనవసరంలేదు. ఇటీవలే మోడీని బీజేపీ ప్రచార సారథిగా ప్రకటించడం పట్ల అలకబూనిన అద్వానీ రాజీనామా చేసి ఆనక ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో నేడు మోడీ.. అద్వానీని ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ గంటపాటు చర్చించుకున్నారు. వారి భేటీలో తాజా రాజకీయపరిణామాలు దొర్లినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, బీహార్లో బీజేపీతో జేడీయూ తెగదెంపులు చేసుకోవడంపై ఈ ద్వయం తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
'మనల్ని వ్యతిరేకించేవాళ్ళు మనతో వద్దు' అని మోడీ పేర్కొన్నారు. కాగా.. మోడీతో విభేదాలు లేవని అద్వానీ చెప్పినట్టు సమాచారం. ప్రచార కమిటీ చైర్మన్ నియామకంపై అలకబూని, పార్టీ పదవులకు రాజీనామా చేయలేదని కూడా ఆయన మోడీకి వివరించినట్టు తెలుస్తోంది. కాగా, మోడీ నేడు ఢిల్లీలో పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషిని కూడా కలిశారు.