‘దమ్ముంటే తలసానిని...’ బీఆర్‌ఎస్‌కు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సవాల్‌

Telangana
Advertisement
  • కేసీఆర్‌పై మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ విమర్శలు
  • దళితులకు కేసీఆర్‌ అన్యాయం చేశారని ఆరోపణ
  • మూడెకరాలు, దళిత బంధుపై ప్రశ్నలు
  • తలసానిని ప్రతిపక్ష నేత చేయాలని డిమాండ్‌
  • కొండా సురేఖను ఢిల్లీకి పిలవడంపై సమాచారం లేదని వెల్లడి
Advertisement
బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తీవ్ర విమర్శలు చేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్‌ మాట తప్పారని ఆరోపించారు. దళిత సమాజం ఆయన్ను ఎప్పటికీ క్షమించదన్నారు. ఓట్ల కోసమే కేసీఆర్‌ దళిత కార్డును ఉపయోగించారని విమర్శించారు.

తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మహేశ్‌ కుమార్‌ గౌడ్‌.. దళితుల కోసం బీఆర్‌ఎస్‌ 2003లో రూపొందించిన డాక్యుమెంట్‌ను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు పథకాలను ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. అంబేద్కర్‌ విగ్రహాలు ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా ఆయన సూచనలను పాటించాలని హితవు పలికారు. దళితుల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్‌కు లేదన్నారు.

దళితులు నడిచిన నేలను శుద్ధి చేసిన బీఆర్‌ఎస్‌ నేతలపై మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మండిపడ్డారు. ‘‘నేలను కాదు.. మీ బుర్రను శుద్ధి చేయాలి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మాక్‌ అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ నేతలు బీసీ నేతకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ గుర్తుచేశారు. కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను ప్రతిపక్ష నేతగా చేయాలని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ ఎలాగూ అసెంబ్లీకి రావడం లేదని, తలసానికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీసీ నేతకు ఆ హోదా ఇస్తే సస్పెన్షన్‌ ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

ఇదిలా ఉండగా మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఢిల్లీకి పిలిచిందన్న వార్తలపై తమకు ఎలాంటి సమాచారం లేదని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ఎవరైనా కబ్జా చేసి ఉంటే.. ఆ వ్యవహారాలు బయటకు రావాల్సిందేనని అన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Mahesh Kumar GoudKCRTalasani Srinivas YadavBRSTPCCTelangana Politics

More Telugu News

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. రైల్వే స్టేషన్‌లో మారణహోమం

30 Oct, 07:06

విలేకరిపై డొనాల్డ్ ట్రంప్ బాడీ షేమింగ్.. చూడటానికి భయంకరంగా ఉన్నావంటూ వ్యాఖ్యలు

30 Oct, 06:41

‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలపై దుమారం.. నసీరుద్దీన్ షాపై ఎన్డీఏ నేతల ఫైర్

30 Oct, 06:14

కొడుకుతో బంధంపై అమితాబ్ ఫన్నీ కామెంట్స్.. కేబీసీలో నవ్వులు

30 Oct, 06:10

ఆర్మేనియా పార్లమెంట్‌లో ఎంపీల ముష్టియుద్ధం.. ప్రజలు చూడాలని లైవ్ ఆపని స్పీకర్!

29 Oct, 22:48

చంద్రబాబు విజ్ఞప్తికి వెంటనే స్పందించిన తెలంగాణ ప్రభుత్వం

29 Oct, 22:38

నాలుగు కుర్చీల హోటల్.. ఇప్పుడు 100కు పైగా బ్రాంచీలు.. 'దిండిగల్‌ తలపాకట్టి బిర్యానీ' విజయగాథ!

29 Oct, 22:27

ఏపీ ఇంటర్ విద్యార్థులకు ఊరట.. ఫీజు చెల్లింపు గడువును పొడిగించిన బోర్డు

29 Oct, 22:16

పక్షవాతానికి, విటమిన్ బీ6కి సంబంధం.. యువతకు అలర్ట్!

29 Oct, 22:01

ఆస్తుల సంఖ్య కాదు, ఆదాయమే ముఖ్యం.. మారిన రియల్ ఎస్టేట్ సూత్రం!

29 Oct, 21:46

జాన్వీ గోల్డ్ కలర్ డ్రెస్సు అంత ఖరీదైనదా..?

29 Oct, 21:35

జేఈఈ మెయిన్ 2027: దరఖాస్తుదారులకు ఎన్టీఏ అలర్ట్

29 Oct, 21:19

ఆర్థిక వివాదంలో రామ్ గోపాల్ వర్మ.. రూ. 29 కోట్లకు పైగా చెల్లించాలన్న ఎక్లాటెంట్ ఫిల్మ్స్!

29 Oct, 21:13

ఇక కబ్జా కుదరదు.. ఆర్.కె.పురం చెరువుకు 'హైడ్రా' కంచె

29 Oct, 20:37

నటిని కాకుంటే క్రికెటర్ అయ్యేదాన్ని: జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు

29 Oct, 20:29
..More Telugu News